తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మొన్నటికి మొన్న దర్శక దిగ్గజం రాజమౌళి తనకు కరోనా సోకిందని ప్రకటించారు. అలాగే దర్శకుడు తేజకు కూడా కరోనా సోకిందనే వార్తలొచ్చాయి. తాజాగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడక తప్పలేదు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలతో ఆయనకు కరోనా వచ్చిందని తెలిసింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులందరినీ సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. నిన్న తెలుగు సింగర్ స్మిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కరోనా సోకిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. తనకు కరోనా సోకలేదని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఆయన ఆరోగ్య పరిస్థిని తేటతెల్లం చేస్తోంది. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన పృథ్వీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని చేపట్టారు. ‘మీ అందరి ఆశీర్వాదం… ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నా’ అంటూ పృధ్వీ ఆ వీడియోలో ఆవేదన చెందుతూ మాట్లాడారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. గత 10 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీడియోలో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వరుస కరోనా కేసులతో టాలీవుడ్ వణుకుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వదలడం లేదు.
పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?
అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...