భూముల త్యాగాల వెనుక కన్నీటి గాధలెన్నో.. చంద్రబాబుపై అక్కసుతోనే విధ్వంస క్రీడ
అన్ని చిన్నా, చితక కుటుంబాలు. ఉన్న ఎకరం రెండు ఎకరాల్లో ఆరుగాలం కష్టించి సాగు చేసుకునే శ్రమజీవులు. పేరుకు సన్న కారు రైతులే అయినా ఏనాడు చేయి చాపే పరిస్థితి లేదు. నిరంతరం శ్రమించి బతుకుతూ.. వ్యవసాయ కూలీలకూ బతుకుదెరువు చూపించారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో రాజధాని అమరావతి కొత్త ఆశలు నింపింది. రాజధానికి భూములిస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఏకైక నమ్మకంతో ప్రాణ సమానంగా భావించే భూములను రైతులు తృణప్రాయంగా త్యాగం చేశారు. చంద్రబాబు పాలనలో అమరావతి పై రైతులు ఆశలు పెంచుకుంటే.. జగన్ అధికారంలోకి వచ్చి ఒక ఇటుకైనా వేయకుండా అమరావతి ఆశలను సజీవ సమాధి చేశాడు. భూములు త్యాగం చేసిన రైతులకు కన్నీళ్లు మిగిల్చాడు.
భూములు ఇచ్చినవారు 90 శాతం మంది సన్నకారు రైతులే
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా 33 వేల ఎకరాలను సేకరించింది. ఎకరాకు పావు వంతు భూమిని రైతులకు ప్లాట్లుగా కేటాయిస్తూ మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రైతులకు సకాలంలో కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. రాజధానికి 3 వేలమంది ఎస్సీలు, బీసీలు ఇచ్చిన 2,600 ఎకరాలకు కౌలు ఇవ్వకుండా నరకం చూపిస్తోంది. అసైన్డ్ భూముల్లో ఆరు కేటగిరీలు ఉండగా, ఏ కేటగిరీ కింద ఉన్న 74 ఎకరాలకు సంబంధించి 52మంది రైతులకే కౌలు చెల్లిస్తోంది. మిగిలిన రైతులను కొలు చెల్లించడానికి భూమికి రుజువులు తెమ్మని అడుగడుగునా వేధిస్తోంది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ల పాటు కౌలు ఇచ్చే విధంగా చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఇప్పటికి 8 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సకాలంలో కౌలు ఇవ్వగా, జగన్ ప్రభుత్వం సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ప్రతి ఏటా కోర్టు మొట్టికాయలతోనే జగన్ ప్రభుత్వం రైతులకు కౌలు ఇస్తోంది. ప్రతి ఏటా మే నెల చివరి వరకు కౌలు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు కౌలు చెల్లించలేదు. ప్రతి ఏటా ఇదే తంతు.
చిన్న మొత్తంతో బతికేది ఎలా?
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.55 వేల రూపాయల లోపే కౌలు అందుతోంది. ఈ చిన్న మొత్తంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. కుటుంబ పోషణ, వైద్యం, పిల్లల చదువు, పిల్లల వివాహాలు ఎలా చేయాలో తెలియక మనోవేదన చెందుతున్నారు. భవిష్యత్తుపై ఎంతో ఆశతో భూములను త్యాగం చేస్తే జగన్ వచ్చి విధ్వంసం చేస్తున్నాడని కన్నీటి పర్యంతమవుతున్నారు.
అడుగడుగునా అవహేళనలు.. అవమానాలు, లాఠీ దెబ్బలు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని మూడేళ్లుగా దీక్షలు, పాదయాత్రలు చేస్తున్న మహిళలను, రైతులను ప్రభుత్వం అడుగడుగునా అవమానిస్తోంది. హేళన చేస్తోంది.
పోలీసులతో లాఠీ చార్జీలు చేయి స్తూ ఉక్కుపాదం మోపుతోంది.
స్లమ్ గా మార్చేందుకు కుట్ర..
పేదల ముసుగులో స్లమ్ గా మార్చడానికి జగన్ ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇతర ప్రాంతాలకు చెందిన 50 వేల మంది రైతులకు అమరావతిలో సెంటు భూములు కేటాయించింది. కోర్టు ఆంక్షలు ఉన్నా శంకుస్థాపన చేసి ఆజ్యం పోసింది.
ఎవరిని అడిగి భూములు ఇచ్చారే..
ఇతర ప్రాంతాల వారికి అమరావతిలో భూములు కేటాయించవద్దని ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్దేశించి ఎవరిని అడిగి భూములు ఇచ్చారే అని నిసిగ్గుగా అమరావతి డీఎస్పి పోతురాజు మాట్లాడటం.. ఎక్కువ మాట్లాడితే డొక్కలు పగులుతాయి అని హెచ్చరించడం.. బయటికి రండి..మీ సంగతి తెలుస్తా..అని బెదిరించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది ఒక్క అమరావతి రైతుల సమస్య కాదు. అందరి సమస్యగా భావిద్దాం. అమరావతి రైతులకు అండగా ఉందాం.అమరావతిని కాపాడుకుందాం.
అమరావతిలోని ఆర్-5 జోన్లో పిల్లను నిర్మించవద్దని హైకోర్టులో స్టేటస్కో రావడం ప్రజలకు ఊరట. ఇదేవిధమైన తీర్పు సుప్రీంకోర్టులో కూడా రావాలని కోరుకుందాం..ఆశిద్దాం.
జై అమరావతి..జైజై అమరావతి.