నిన్నటిదాకా ముందస్తుపై లీకులు.. మోదీని కలిసిన తర్వాత ముందస్తు లేదని మైకుల ముందు వైసీపీ నేతల హడావిడి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలను ఆలోచన మానుకున్నారు తెలుస్తోంది, ప్రతిష్టాత్మకమైన తొమ్మిది నెలల ప్రచార ప్రణాళికను రూపొందించారు అని దాని పక్కాగా అమలు చేయాలి సీఎం జగన్ యేచిస్తున్నటు సమాచారం. ముందస్తు ఎలక్షన్ కి వెళ్తే అధికారం చేజిక్కించుకోవచ్చు అనుకున్న సీఎం జగన్ ప్లాన్ ని పీఎం నరేంద్ర మోడీ బ్రేక్ వేసాడని సమాచారం. రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలనే లక్ష్యంతో వచ్చే తొమ్మిది నెలలు కష్టపడి పనిచేయాలని ఆయన తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ, ముందస్తు ఎన్నికలు ఉండవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పనికట్టుకొని మరి ముందస్తు ఎలక్షన్ లేవని, సాధారణంగానే ఎలక్షన్స్ 2024లోనే జరుగుతాయని గొంతు చించుకుంటున్నారు.. ఈ లోపు వైసీపీ చేయాల్సిన కార్యాచరణను సిద్ధం చేసాడంట అప్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో ఉండాలి అని, లేదంటే వాళ్ళకి పార్టీ టికెట్, సపోర్ట్ ఉండదు అని హుక్కుమ్ జారీ చేసాడట. సీఎం జగన్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఎక్సపెక్ట్ చేయని వైసీపీ నాయకులూ బిక్కమొహం వేసుకొని చేయాల్సిని కార్యాచరణ మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది..
అయితే వైసీపీ నాయకులు ఇలా సీఎం జగన్ ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని ఆలోచిస్తే ఇదంతా పీఎం నరేంద్ర మోడీ ఆడొస్తున్న ఆట అని అర్థమైంది, పీఎం నరేంద్ర మోడీ కోరిక మేరకు , సీఎం జగన్ ముందస్తు ఎలక్షన్ కి వెళ్లడం లేదు అని, మోడీ చెప్పిన్నటు చేసి ఎన్డీయే కూటమిలో దోస్తీ పెంచుకోవాలి సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఢిల్లీ పర్యటన లో జరిగిన్నటు సమాచారం.