జగన్ సర్కార్‌పై సీనియర్ నటుడు, నిన్నటితరం హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా ఆయన స్పందించారు.. జగన్ సర్కార్ పై నిశ్శబ్ద విప్లవం సాగుతోందని, త్వరలో తిరుగుబాటు ఖాయమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు నటుడు నరేష్. జగన్ పాలనా తీరుతో కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయని భయం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ సర్కార్‌పై ఒక సినీ నటుడు ఇంత ఘాటుగా స్పందిచడం ఇదే మొదటిసారి… జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు హీరోలు, నటులు విమర్శలు చేసినా తిరుగుబాటు ఖాయం అని, సైలెంట్ రివల్యూషన్ సాగుతోందని వ్యాఖ్యానించడం మాత్రం దుమారం రేపుతోంది..
ప్రస్తుతం నరేష్ మార్టిన్ లూధర్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ఇది.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నరేష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు హాట్ హాట్‌గా మారుతున్నాయి.. గతంలో రాజకీయాలలోనూ యాక్టివ్‌గా ఉన్నారు నరేష్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బీజేపీ కోసం పని చేశారు.. బీజేపీలో యాక్టివ్‌గా కొన్ని సంవత్సరాల పాటు బిజీగా ఉన్నారు.. తర్వాత సినీ కెరీర్‌పై ఫోకస్ చేయడంతో నరేష్.. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు..
తాను పాలిటిక్స్‌లో ఉన్న సమయంలో రాజకీయాలు హుందాగా ఉన్నాయని అభిప్రాయపడ్డ నరేష్, ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయన్నారు. గతంలో విమర్శలు హుందాగా ఉండేవని, నేడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని తెలిపారు. అసభ్య పదజాలంతో తిట్టుకుంటున్నారన్నారు.. పరోక్షంగా ఆయన చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలని గుర్తు చేశారు. ఇటు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్,
అనిల్ యాదవ్ లాంటి నేతల దూషణభూషణలను సైతం ఆయన ఫాలో అవుతున్నట్లు అర్ధం అవుతోంది. ఈ తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే జాలి వేస్తుందన్నారు..
మరోవైపు, ఇటీవల చంద్రబాబు జైలులో ఉండగా కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు … నారా భువనేశ్వవరిని పరామర్శించారు.. ఆ సందర్భంగా ఆయన టీడీపీకి 150కిపైగా ఎమ్ఎల్ఏ స్థానాలు రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.. ఇలాంటి రాజకీయ పరిస్థితులు తాను గతంలో చూడలేదన్నారు.. దాదాపు ఇదే అభిప్రాయాన్ని ఆయన కుటుంబ సభ్యుడయిన నరేష్ సైతం వెలిబుచ్చడం హాట్ టాపిక్ గా మారుతోంది… ఇండస్ట్రీ మొత్తం ఏపీలో అధికార మార్పిడి జరగాలని, అవుతుందని భావిస్తున్నట్లు తాజా పరిణామాలతో అర్ధం అవుతోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మరి, నరేష్ వ్యాఖ్యల దుమారం ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూడాలి.