మార్క్ రాజకీయాలతో సంచలనాలు..!
నారా బ్రాహ్మిణి తన రాజకీయాలు వ్యూహాలను పదును పెడుతున్నారు. తనదైన మార్క్ రాజకీయాలతో సంచలనాలను నమోదు చేస్తున్నారు. ఆమె వేసే ప్రతి అడుడు వ్యూహాత్మక రాజకీయాలకు తెరతీసేలా ఉన్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విశ్లేషకులు.., రాజకీయ మేధావుల దృష్టిని ఆకర్షిస్తోందని నారా బ్రాహ్మిణి.
బాబు అరెస్ట్ తో మారుతున్న రాజకీయం..!
చంద్రబాబు అరెస్ట్ తరువాత మారిన రాజకీయ పరిణామక్రమంలో బయటకొచ్చారు నందమూరి.., నారా కంబైన్డ్ వారసురాలు నారా బ్రాహ్మిణి. రాజమండ్రి జైల్లో చంద్రబాబును జుడిషియల్ కస్టడిలో ఉంచి నాటి నుంచి తూ. గో లో మాకాం వేసి.. తన వారసత్వంగా అబ్బిన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టడం ప్రారంభించారు బ్రాహ్మిణి. రాష్ట్ర ప్రజలు.., పార్టీ క్లిస్ట పరిస్థితి ఎదుర్కొంటున్న తీరును గమనించిన బ్రాహ్మిణి తన అనివార్య రాజకీయ ప్రస్థానం ప్రారంభించక తప్పడంలేదని భావించారు.
వ్యూహాత్మంకగా అడుగులు..!
రాజమహేంద్రవరం వేదికగా నారా వారి యువరాణి.. నందమూరి వారసురాలు బ్రాహ్మిణి తొలి అడుగును బయటపెట్టారు. క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో బ్రాహ్మిణి వెంట రాజకీయాలకు అతీతంగా మహిళలు పెద్దఎత్తున నడిచి.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రశ్నలకు తడబాటు లేకుండా తన సమాధానాలిచ్చిన తీరు అందర్ని ఆశ్చర్యపరిచింది. పార్టీలో కూడా ఫుల్ జోష్ ను నింపింది.
ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలకు ట్విట్టర్ వేదికగా బ్రాహ్మిణి స్పందించారు. ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని ప్రశ్నించారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడాన్ని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు చాణుక్య నీతి ఇదే..!
సులభతర వ్యాపారం.., నైపుణ్యాభివృద్ధి రంగాలలో ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు అగ్రస్థానంలో అప్పుడు నిలిపితే.., నేడు అమర్ రాజా.., లులు వంటి సంస్థలు ఏపీని వదిలి.. తెలంగాణకు ఎందుకు పారిపోవడానికి ఎవరు కారణం అని ఆమె ప్రశ్నించారు. పరిశ్రమలు..,పెట్టుబడుల విషయంలో పుష్ అవుట్.., పుల్ ఇన్ సూత్రాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తోందన్నది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తరిమేయబడిన సంస్థలన్నీంటిని తెలంగాణలో లాక్కొబడడంలో అంతర్యం ఏమిటి..? అని నిలదీశారు. అమర్ రాజా.., లులు వంటి సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయిన వైనాన్ని ఉదహరిస్తూ ‘ది ఫ్రింట్’ వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని తన ట్వీట్ లో బ్రాహిణి జత పరిచారు.