ఏపీ సర్కార్ బార్ అండ్ రెస్టారెంట్లకు మరో షాక్ ఇచ్చింది. ఛీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం, అయిన వారి లిక్కర్ కంపెనీల ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదని గ్రహించిన అధికారులు వీటి అమ్మకాలపై అనధికార షరతులు పెట్టారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లు 50 కేసులు కొంటేనే 10 కేసులు చీప్ లిక్కర్ కొనుగోలుకు అనుమతిస్తున్నారు. బార్లు కూడా చీప్ లిక్కర్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి వల్ల మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు తగ్గాయని అధికారులు గుర్తించారు. ఇక నుంచి చీప్ లిక్కర్ కావాలంటే మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు అనధికార షరతులు విధించారు.
ఆదాయం పెంచుకునేందుకేనా…
అలవాటు పడ్డ బ్రాండ్లు దొరక్క ఇప్పటికే ఏపీలో మద్యంప్రియులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబుల ఆగ్రహానికి ఆజ్యం పోసేలా ఉంది. ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.150 నుంచి రూ.200 దాకా అమ్ముతున్నారు. ఇక మీడియం, ప్రీమియం బ్రాండ్లు అయితే క్వార్టర్ మందు రూ.400 నుంచి రూ.600 దాకా అమ్ముతున్నారు. పేరుకే మీడియం, ప్రీమియం బ్రాండ్లు అయినా క్వాలిటీలో అవి కూడా చీప్ లిక్కర్ తో పోటీ పడుతున్నాయి. పేరున్న కంపెనీల బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదు.
దీంతో మద్యంప్రియులు చీప్ లిక్కర్ నే ఎక్కువగా తాగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయంలో పెద్దగా వృద్ధి నమోదు కావడం లేదు. ఇది గమనించిన అబ్కారీ శాఖ అధికారులు కొత్త స్కెచ్ వేశారు. 50 కేసుల మీడియం, ప్రీమియం బ్రాండ్ల మద్యం కొంటేనే 10 కేసుల చీప్ లిక్కర్ ఇస్తామని బార్లుకు అనధికార ఆదేశాలు జారీ చేశారు. దీంతో బార్లలో చీప్ లిక్కర్ దొరక్క అధిక ధర చెల్లించి మీడియం, ప్రీమియం బ్రాండ్లు తాగాల్సి వస్తోందని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also rEAD ;- బార్లకు పచ్చజెండా : వెయ్.. మందెయ్.. చిందెయ్యర చిన్నోడా..
మీడియం, ప్రీమియంపై ఎందుకంతప్రేమ
ఏపీ సర్కార్ మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలను గణనీయంగా పెంచేందుకు అంబాసిడర్ లా వ్యవహరిస్తోంది. మీడియం, ప్రీమియం మందు తయారు చేసే కంపెనీలు కొందరు వైసీపీ నేతల చేతుల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వారి జేబులు నింపేందుకు ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చీప్ లిక్కర్ తగ్గించి మీడియం, ప్రీమియం మందు అమ్మకాలు పెంచాలని అబ్కారీ అధికారులను ఆదేశించారు. వారు ఇక వెంటనే రంగంలోకి దిగిపోయి, అనధికార నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు.
30 శాతం పెంచాలని టార్గెట్…
అబ్కారీ అధికారులకు జిల్లాల వారీగా నెలవారీ ఆదాయంపై ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది. గత ఏడాది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కన్నా, ఆ ఏడాది ఒక్క జిల్లాలో, ప్రతి నెలా 30 శాతం అదనంగా ఆదాయం సాధించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో అధికారులు ఈ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారు. అంటే ప్రజల వద్ద నుంచి సాధ్యమైనంత ఎక్కువగా ఎలా పిండాలనే దానిపై పరిశోధన చేసి అబ్కారీ అధికారులు ఈ కొత్త ప్రణాళికను అనధికారికంగా అమల్లోకి తెచ్చారు. అధికారుల అనధికార చర్యలతో రేటు ఎక్కువగానే ఉన్న చీప్ లిక్కర్ దొరక్క మద్యం ప్రియులు ప్రీమియం బ్రాండ్లు తాగి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన రత్నాలు మరలా తిరిగి తీసుకురావాలి
ఏపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రతి నెలా రూ.7000 కోట్లు నగదు బదిలీ చేస్తోంది. ప్రజలకు మనం ఇంత చేస్తుంటే, వారు నాకు సాయం చేయరా అన్న చందంగా తయారైంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేను ప్రజలకు ఎంతో ఇస్తున్నారు. వారు నాకు కూడా ఇవ్వాలి. అందుకే ప్రతి నెలా కనీసం రూ.4000 కోట్లు మద్యం ద్వారా ఆదాయం తీసుకురావాలని అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు. రకరకకాలుగా ఆలోచించి ఈ సరికొత్త నిర్ణయంతో మద్యంబాబుల మత్తుదిగే నిర్ణయం తీసుకున్నారు.
Also rEAD ;- వైఎస్ భారతి రెడ్డి ధిల్లీ టూర్..ఇందుకేనా..