కాకరేపుతున్న అక్రమ కేసులు..!
తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. లోకేష్ తో పాటు పార్టీలోని కొందరు సీనియర్లును అరెస్ట్ చేసేందుకు పధకం రచిస్తోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి.. దొడ్డిదారిలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే నేపంతో జగన్ రెడ్డి వింత ఆటకు తెరతీశారు. ఢిల్లీ నుంచి ఏపీకి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేయాలని చూస్తున్న సీఐడీ వ్యూహాన్ని పసికట్టిన తెలుగు దేశం పార్టీ.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సర్వత్ర ఉత్కంఠ రేపిన లోకేష్ బెయిల్ పై హై కోర్టులు తీర్పును వెలువడించింది. అక్టోబర్ 4 వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చెయ్యుద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది హైకోర్టు.
స్కిల్ కేసులో అలా..! ఫైబర్ గ్రిడ్ కేసులో ఇలా..!
సంబంధంలేని ఒక అక్రమ కేసును అల్లి.. సైకో నేత్రానందలో భాగంగా స్కిల్ కేసును తెరపైకి తీసుకొచ్చింది సీఐడీ. ఇందులో ఏ37 గా ఉన్న చంద్రబాబును.. కాదు..కాదు.. అంటూ ఏ1గా చిత్రీకరించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. సీఐడీ వ్యూహాన్ని.., జగన్ రెడ్డి మతిస్థిమితంలేని ఆలోచనలను గ్రహించిన తెలుగు దేశం లీగల్ సెల్ టీం దీనిపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న కోర్టు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు ఎటువంటి అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలానే ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా వచ్చే నెల 4 వరకు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది.
ఆరిపోయే దీపానికి నీచ రాజకీయాలు తోడు..!
ఏపీలో సర్వత్ర తీవ్ర విమర్శలు.., ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత.., మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పెద్ద దెబ్బ. అరెస్ట్ చేసి ఆనందంలో ఉన్న జగన్ కు తెలుగు దేశం వ్యూహాలు ప్రస్తుతం నిద్రపట్టనివ్వడం లేదు. అరెస్ట్ చేసి తన కోర్కే తీరిందనుకుంటున్న జగన్ పొటికల్ డ్రామాకు.. హై డ్రామా మొదలు పెట్టింది తెలుగు దేశం. గేమ్ ఛేంజ్ చేసి వేసిన రివర్స్ గేర్ కు జగన్ అండ్ కో విలవిలాడుతోంది. ఇప్పటికే అన్నీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతలు.., విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి పార్టీ చివరికి ఆరిపోయే దీపంలా మారింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆడుతున్న నీచ రాజకీయాలు జగన్ రెడ్డికి.. ఆయన పార్టీకి పుండుమీద కారంలా మారింది. దెబ్బమీద దెబ్బ కొడుతూ.. తెలుగు దేశం శ్రేణులు కదుపుతున్న న్యాయపరమైన పావులకు దెబ్బపడక తప్పదు అన్నట్లు రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.