గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలు నాటి తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్, నటి శృతిహాసన్‌లను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ మొక్కలు నాటారు. తాజాగా కమలహాసన్ తనయ శృతిహాసన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. మహేష్ బాబుతో బాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఆమెను నామినేట్ చేసిన విషయం విదితమే. ఆకుపచ్చని ఆరోగ్య భారతావని కోసం.నన్ను నామినేట్ చేసినందుకు మహేష్, దేవికి నా ధన్యవాదాలు తెలిపిన ఆమె బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, రానా దగ్గుబాటి, తమన్నాలను నామినేట్ చేశారు.
ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?
పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందా ?...