నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో అఖండ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ ఉంది. దీనికి తోడు ఈ మూవీ టీజర్ కి రికార్డు వ్యూస్ రావడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. మే 28న అఖండ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో అఖండ విడుదల వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ ఇటీవల ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ శ్రీకాంత్ ఏం చెప్పారంటే.. ఈ చిత్రంలో బాలయ్య రెండు కంటే ఎక్కువ పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి కానీ.. బాలయ్య చేస్తుంది కేవలం రెండు రోల్స్ మాత్రమే. అఘోరా పాత్ర అనేది జస్ట్ రోల్ లా కాకుండా చాలా ఉన్నతంగా ఉంటుంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని శ్రీకాంత్ చెప్పారు.
ముఖ్యంగా బాలయ్య తన కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయన్నారు. శ్రీకాంత్ అఖండ గురించి మాట్లాడిన తర్వాత బాలయ్య అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి.. సింహా, లెజెండ్ చిత్రాల వలే అఖండ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి బాలయ్య, బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య దర్శకత్వం?