1) గుడివాడలో కొడాలి నానికి `కాపు` సెగ తప్పదా..??
కాపు సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు అలియాస్ నాని పై కాపు సంక్షేమ సేన గుర్రుగా ఉందని తెలుస్తోంది.. సేనలో కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి సంఘాలు ఉన్నాయి.
అయితే కొడాలి నానికి నోటి దురుసు కారణంగా వేరే కులం వాళ్ళు ఆవేశంతో ఉన్నారని సమాచారం. ఒక సామజిక వర్గాన్ని కించపరిచేలా కొడాలి నాని మాట్లాడటం , అదే సమయంలో వేరే సామజిక వర్గానికి చెందిన లీడర్లను నోటి దూరుషు ప్రవర్తన వల్ల వచ్చే ఎలక్షన్ లో కొడాలి నానికి చుక్కెదురు అవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ మధ్య గుడివాడలో ఒక సర్వే నిర్వహించగా తేలిన నిజాలు ఏంటంటే, కొడాలి నానికి నోటి దురద ఎక్కువ, పైగా గుడివాడలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కూడా ప్రజలకి చేసింది సూన్యం అని తేలింది. పైగా గుడివాడని మేమె అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్న కొడాలి నాని, ఈ నాలుగేళ్ళ కాలంలో గుడివాడలో రోడ్లు చాలా అద్వానంగా తయారయ్యని, ఎన్నికల సమయంలో గుడివాడ ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రజలు అంటున్నారు.
అదీగాక గత ఏడాది కాలంగా కొడాలి నాని ప్రెస్ మీట్లు పెట్టడం ప్రతిపక్షం నాయకులని నోటికొచ్చినట్లు తిట్టడం కూడా ఆయనకీ పెద్ద మైనస్ అయిందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా కొడాలి నానికి కొమ్ము కాస్తూ వస్తున్నా కాపు సామజిక వర్గం, ఈ సారి కొడాలి నానికి పెద్దగా సపోర్ట్ ఉండకపోవచ్చు. పైగా ఆయన కులం పేరుతో దూషించడం కూడా ఆ వర్గానికి కోపం తెప్పించిందని తెలుస్తోంది. కాపు ఓట్లతో గెలిచిన కొడాలి నాని, అదే కాపు వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం , పైగా పవన్ కళ్యాణ్ ని అదే పనిగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. గత ఏడాది కొడాలి నాని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపత్యంలో, గుడివాడలో కొడాలి నానికి కాపు సెగ ఈ సారి గట్టిగ తలబోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.. రాబోయే ఎలక్షన్ లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని , ఆయన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసిపోయింది..