ఈ సంవత్సరం కోవిడ్ -19 వలన అందరూ ఇంట్లోనే ఉండి తమ తమ అభిరుచుల్ని ఆస్వాదించారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి, టీవీలో కొత్త ఎపిసోడ్లు, షోలు కూడా లేవు. అందుకే సినీ ప్రేమికులు ఆన్ లైన్ స్ట్రీమింగ్ అయిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో భలేగా కాలక్షేపం చేశారు. గులాబో సీతాబో, లక్ష్మితో సహా చాలా సినిమాలు థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యాయి. అయితే ఆ లిస్ట్ లో భారతీయ ప్రేక్షకులందరూ చూడాల్సిన మోస్ట్ క్రిమినల్ అండర్ రేటెడ్ సినిమాలు ఇవే..
కడఖ్
రజత్ కపూర్ రాసిన ఒక డార్క్ కామెడీ. ఇది అతని ఏడవ చిత్రం, రణవీర్ షోరే, కల్కి కోచ్లిన్, సైరస్ సాహుకర్ మరియు తారా శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం దీపావళి రాత్రి ఒక జంట పార్టీని నిర్వహిస్తుంది. ఆ పార్టీలో ఊహించని సంఘటన జరుగుతుంది. ఒక గుర్తు తెలియని మృతదేహం చుట్టూ కథ నడుస్తుంది. వారికి సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేస్తుంది.
ఎక్కడ చూడాలి: సోనీ లివ్
షికారా
మున్నా భాయ్ విధు, వినోద్ చోప్రా తీసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఇదొకటి ఒకటి. షికారా సినిమా ఒక వ్యక్తి తల్లిదండ్రుల కథపై ఆధారపడింది. కానీ చాలా కల్పితమైన కథనంతో నడుస్తాది. 1990లో కాశ్మీరీ పండిట్ల ఎక్సోడస్ నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇది ఒక అందమైన ప్రేమకథ. చివరికి మిమ్మల్ని బాగా కదిలిస్తుంది.
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో
భోంస్లే
మనోజ్ బాజ్ పై నటించిన ఈ చిత్రం 2020లో సరైన సమయంలో విడుదలైంది. చాలా సందర్భోచితంగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వలన వలసదారులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళడానికి కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్న ఇబ్బందును ఇందులో చూపించారు. ఈ చిత్రం రిటైర్డ్ కాప్ గణపథ్ భోంస్లే, ముంబైలో బయటి వ్యక్తులుగా కనిపించే వలసదారుల మధ్య కథ నడుస్తుంది.
Must Read ;- ఐ.యమ్.డీ.బీ టాప్ 10 వెబ్ సిరీస్ 2020 లిస్ట్ ఇదే!
ఎక్కడ చూడాలి: సోనీ లివ్

పరీక్ష
ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్ చేసిన నటన బెర్లిన్లో జరిగిన ఇండో-జర్మన్ చిత్ర వారంలో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో భారతీయ విద్య విధానం అందులోని లోపాలను ఎత్తి చూపారు దర్శకుడు. ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించారు. హుస్సేన్ ఒక రిక్షా పుల్లర్ పాత్రను పోషించారు. అతను తన కొడుకుకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకోవడానికి ఏర్పాట్లు చేయడం ద్వారా ఉత్తమ నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటాడు. ఆతర్వాత ఏమి జరిగిందనే విషయాన్ని సినిమాను చూసి తెలుసుకుంటే బావుంటుంది.
ఎక్కడ చూడాలి: జీ 5

తైష్
ఈ సంవత్సరం విడుదల చేసిన విప్లవాత్మక భారతీయ ప్రాజెక్టులలో ఇది ఒకటి. మొట్టమొదటిసారిగా ఒక సినిమా కథ ఒక చిత్రంగా ఇంకా వెబ్-సిరీస్ గా ఒకేసారి విడుదలైంది. పుల్కిత్ సామ్రాట్, కృతి ఖర్బండా, జిమ్ సర్బ్, సంజీదా షేక్, హర్షవర్ధన్ రాణే నటించిన ఈ సినిమాను బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఇది ఇద్దరు స్నేహితుల కథ. వారి జీవితంలో అంతకముందు జరిగిన హింసాత్మక సంఘటనలు వలన చివరికి వారి స్నేహం ఒక దీర్ఘకాల పరీక్షగా మారుతుంది.
ఎక్కడ చూడాలి: జీ 5

చింటు కా బర్త్ డే
ఇది 2004లో నిర్మించిన కథ. యుద్ధంలో దెబ్బతిన్న బాగ్ దాద్ లో భారతీయులు చిక్కుకున్నసమయం అది. లాక్ డౌన్ లో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించిన కల్పిత కథను ఈ చిత్రం వివరిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు వారి కుమారుడు చింటు పుట్టినరోజును జరుపుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కుదరదు. ఆ సమయంలో అక్కడ ఎవరు ఎటువంటి వేడుకలు జరుపుకోకూడదు. ఎందుకంటే అప్పుడు సద్దాం హుసేన్ యుద్ధంలో ఓడిపోతాడు. ఆ సమయంలో ఆ కుటుంబం ఇరాక్ లో చిక్కుకుంటుంది. అప్పుడు వారు ఏవిధంగా ఇబ్బందులు పడ్డారనేది కథ. తిల్లోటమా షోమ్, సీమా పహ్వా, వేదాంత్ చిబ్బర్ నటించారు.
Also Read ;- నిహారికకు 2కోట్లు ఖరీదు చేసే నగలను గిఫ్ట్ గా ఇచ్చిన పెదనాన్న
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

రామ్ సింగ్ చార్లీ
సర్కస్ లు వచ్చి వెళ్తూ ఉంటాయి, కానీ జీవితం కొనసాగుతుంది! సర్కస్ ప్రదర్శనకారుడు రామ్ సింగ్ చార్లీ చేసిన పోరాటాలను హైలైట్ చేయడం ఈ కథ సారాంశం. మేరా నామ్ జోకర్ సినిమా జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే చిత్రం ఇది. కుముద్ మిశ్రా ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఇదే ఉత్తమ ప్రదర్శన అని చెప్పొచ్చు. అతను పనిచేసే సర్కస్ మూసివేసిన తరువాత అనేకమందితో పాటు నిరుద్యోగిగా మిగిలిపోతాడు. తర్వాత ఎం జరిగిందనేది కథ. ఈ భావోద్వేగ కథ మీకు కన్నీటి పర్యంతం చేస్తుంది. కాని ఒక మంచి చిరునవ్వు తీసుకుని వస్తుంది.
ఎక్కడ చూడాలి: సోనీ లివ్

కామ్యాబ్
“క్యారెక్టర్ యాక్టర్స్ కో ఆలూ కహా జాతా హై. ఆలూ కిసి భీ చీజ్ మెయిన్ పట్టా హై. ఆలూ గోభి, ఆలూ బైంగన్, ఆలూ తమటర్, ఆలూ పయాజ్… కామెడీ హో, థ్రిల్లర్ హో, రొమాన్స్ హో… బచ్చన్ హో, కపూర్ హో యాఖాన్ హో… సైడ్ కిక్స్ హర్ జగా ఫిట్ హో జేట్ హైన్ ”. కొన్నేళ్లుగా మంచి సినిమాలను గొప్పగా తీర్చిదిద్దిన సైడ్ కిక్స్ లో ఇదో చిత్రం, ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా సంజయ్ మిశ్రా నటించారు. ఇది నిజ జీవిత కథ ఆధారంగా కాదు. కానీ ఇది బాలీవుడ్ లోని చాలా మంది నటుల యొక్క క్యారెక్టర్ కథ. వారు పడే కష్టం ఎలా ఉంటుందనే దానిపై సినిమాను తీశారు.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

చిప్పా
ఈ చిత్రం ఒక వీధిలో నివసించే ఒక చిన్న పిల్లవాడి కథను అనుసరిస్తుంది. ఆ పిల్లాడికి కొన్ని కోరికలు ఉంటాయి. అందులో కొన్ని పెద్దవి కొన్ని అతని తల్లిదండ్రులను వెతకడం లాంటి సులభమైనవి . ఒక శీతాకాలపు రాత్రి, అతను కాల్ కత్తా నగరంలో తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒంటరిగా బయలుదేరతాడు. అతను తన తండ్రిని కలవడానికి దగ్గరగా వస్తాడు, కాని విధి మరోలా తన జీవితాన్ని మారుస్తుంది. అదేమిటో తెలియాలంటే సినిమా తప్పక చూడాల్సిందే. లయన్, సేక్రేడ్ గేమ్స్ లో నటించిన బాలుడు సన్నీ పవార్ ఇందులో కూడా నటించాడు.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
ఆక్సోన్
ఈ సినిమా నలుపు తెలుపు జాతి వర్గాలు గురించి మాత్రమే కాదు, మనమందరం వివిధ స్థాయిలలో జాత్యహంకారాలకు ఎలా గురవుతున్నామో తెలిపే కథ. విద్యావంతులైన ప్రజలు మెట్రో నగరాల్లో అలాగే ఈశాన్య ప్రజలును మిగిలిన వారు ఏవిధంగా వివక్షతతో చూస్తున్నారో ఈ చిత్రం ద్వారా తెలియజేసారు.
Also Read ;-
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

రాత్ అకేలి హై
మీకు మర్డర్ మిస్టరీ కధలు అంటే ఇష్టమా? ఐతే ఈ కథ మీకు నచ్చుతుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో ఒక పోలీసు పాత్రలో కనిపిస్తారు. సిద్దిఖీ ఒక హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు హంతకుడు ఎవరు అనే దానిపై ప్రేక్షకులు కనీసం ఐదు అంచనాలు వేయడానికి ప్రయత్నిస్తారు. చివరికి అవన్నీ తప్పు అని తేలుతుంది. ఈ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

బుల్బుల్
బుల్బుల్ సాధారణ భయానక కథ కాదు, అయినప్పటికీ ఈ కథ బాగానే భయపెడుతుంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ చిత్రంలో త్రిప్టి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఒక శక్తివంతమైన స్త్రీవాద కథ. సినిమాలో చూపిన రియాలిటీ నిజంగానే భయంగానే ఉంటుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

సీరియస్ మెన్
సుధీర్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశేషమైన వ్యంగ్యం, దళిత స్వరం కనపడుతుంది. అదే సమయంలో హస్యంతో , విషాదకరమైన కథాంశంతో సాగుతుంది. మను జోసెఫ్ నవల ఆధారంగా తీసినది. ఈ చిత్రం ఒక తండ్రి, అతని మేధావి కుమారుడి చుట్టూ తిరుగుతుంది.
Also Read ;- అంబానీ సామ్రాజ్యంలో నవతరం ఆరంభమైంది
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్

https://www.youtube.com/watch?v=exzVGm6tYQo










