ఆ బుడతడి వయసు పట్టుమని 14 ఏళ్లు. ‘కౌన్ బనేగా కరోర్‌పతి’లో అమితాబ్‌కు ఎదురుగా కూర్చున్నాడు. ఆయన అడిగే ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పేస్తున్నాడు. అలవోకగా వేల నుంచి లక్షల స్థాయిలోకి వెళ్లిపోయాడు. పాతిక లక్షల ప్రశ్నకూ టపీమని సమాధానం చెప్పేశాడు. ఇంకేముంది సునాయాసంగా కోటి గెలిచేస్తాడని అందరూ భావించేశారు. ఇంతలో 50 లక్షల ప్రశ్న వచ్చింది. దానికి కచ్చితమైన సమాధానం తెలియదు. అక్కడే ఆ బుడతడు.. తన తెలివితేటలు ప్రదర్శించాడు. అంతటితో గేమ్ నుంచి వైదొలిగాడు. దీంతో.. 25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దీంతో పాటు అమితాబ్ నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. అలాగే.. షో నిర్వాహకుల నుంచి మరో ఐదు లక్షలు స్కాలర్షిప్ దక్కించుకున్నాడు.
Must Read ;- యన్ఠీఆర్, అమితాబ్ లా మారిపోయిన డేవిడ్ వార్నర్
Little genius ANMOL SHASTRI aka Mr. Jigyasu dreams of becoming a Nobel laureate and an astrophysicist. Watch him on the hotseat in our #StudentSpecialWeek, in #KBC12 at 9PM only on Sony TV. @SrBachchan @SPNStudioNEXT pic.twitter.com/QgOvcBIQrj
— sonytv (@SonyTV) December 14, 2020
గుజరాత్‌కు చెందిన 14 ఏళ్ల అన్మోల్ శాస్త్రి.. కేబీసీ స్టూడెంట్స్ స్పెషల్ వీక్‌లో పాల్గొన్నాడు. తన తెలివి తేటలతో అమితాబ్‌నే అబ్బురపరిచాడు. 25 లక్షల వరకు అప్రతిహతంగా దూసుకుపోయిన శాస్త్రికి 50 లక్షల ప్రశ్న వద్ద బ్రేక్ పడింది. అప్పటికే ఆ చిచ్చరపిడుగుకి లైఫ్లైన్లు కూడా అయిపోవడంతో.. అంతటితో గేమ్ నుంచి వైదొలగాడు.
ఇవే నా మూడు కోరికలు
అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్స్‌ను ఎంతగానో ఇష్టపడే శాస్త్రికి ఖగోళ శాస్త్రవేత్త కావాలనేది చిరకాల కోరిక. దీంతో పాటు నోబుల్ ప్రైజ్ గెలవాలని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవాలనేది కూడా మన శాస్త్రి గారి కోరికలట. ప్రస్తుతం ఈ బుడ్డోడు.. ‘హౌఇట్ వర్స్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా నడిపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమితాబ్.. ఆ బుడ్డోడి యూట్యూబ్ చానల్‌కు ప్రమోషన్ కూడా చేస్తానని మాటిచ్చారు.