కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ తన రీ ఎంట్రీ కోసం ఈ కోవిడ్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కఠినమైన వ్యాయామం, ఆయుర్వేదిక్ డైట్ తో ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన ఆయన ఎంచక్కా స్లిమ్ గా కనిపిస్తున్నారు. ఆ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫోటోలను పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి..

తాజాగా రెండు సినిమాలను అంగీకరించిన మనోజ్.తెలుగు దర్శకుడితో ఓ చిత్రం, తమిళ దర్శకుడితో రెండో చిత్రం చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్నాయి. వచ్చే ఏడాదిలో ఇవి విడుదల కానున్నాయి. ఇదిలావుండగా.. స్పోర్ట్స్ , ఎంటర్టైన్మెంట్ సిటీని కూడా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మనోజ్.
Must Read ;- మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు.. సందడి చేసిన నవదంపతులు











