ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో కేఎస్ రావు అలియాస్ కొలికపూడి శ్రీనివాసరావు అనే ఎనలిస్ట్ చెప్పాడు.. ఎన్నికల నాటికి ఇది 40కి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.. ఇదంతా లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ అని రివీల్ చేశాడు..
నారా లోకేష్ ఇటీవలే రాయలసీమలో యువగళం పాదయాత్ర తో ప్రభంజనం సృష్టించాడు. . వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లోకేష్ పాదయాత్రకు అశేష ప్రజాదరణ లభించింది, ఎప్పుడు లేని విధంగా రాయలసీమలో టీడీపీ కి ప్రజలు నీరాజనాలు పట్టారు.సవాలు కు ప్రతి సవాలు విసురుతూ వైసీపీ నాయకులకి నిద్రలేకుండా చేసాడు. వైసీపీకి రాయలసీమ అడ్డాగా చెప్పుకునే వాళ్ళు కాస్త లోకేష్ పాదయాత్ర తరువాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఎక్కడిక్కక్కడ వైసీపీ నాయకుల సవాల్‌కు ఎదురు వొడ్డుతూ, విజయవంతంగా తన పాదయాత్రను పూర్తి చేసాడు.. లోకేష్ పాదయాత్ర తరువాత రాయలసీమ టీడీపీకి అనుకూలంగా మారిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటె రాయలసీమలో లోకేష్ పాదయాత్ర తర్వాత ఇంటెలిజెన్స్ సర్వే నివేదిక ప్రకారం టీడీపీ 34 స్థానాలపై కన్నేసింది. ఎన్నికల నాటికి ఈ సంఖ్య 40 సీట్లు లేదా 44 స్థానాలకు చేరుకోవచ్చు అని, జగన్‌కు చాలా నమ్మకమైన అధికారి ఇచ్చిన సర్వే ఇది అని తెలుస్తోంది. ఇలాగె లోకేష్ పాద యాత్ర కొనసాగితే, రాయలసీమ పరిస్థితే ఇలా ఉంటే నెల్లూరు నుంచి ఇచ్ఛాపురం వరకు క్లీన్‌స్వీప్ చేయవచ్చు సంచలన రిపోర్ట్స్ అందుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాల్లో టీడీపీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. ఆ 34 స్థానాలను కూడా టీడీపీ పరిశీలిస్తే, టీడీపీకి అనుకూలంగా స్వీప్ ఎన్నికలు జరగడం ఖాయంగ కనపడుతోంది.
లోకేష్ యువగలం పాదయాత్ర సక్సెస్ అవడంతో వైసీపీనాయకులు తలలు పట్టుకుంటున్నారు. అలాగే టీడీపీ మేనిఫెస్టో కూడా కల్సివచ్చిందనే చెప్పాలి, అదే సమయంలో వైసీపీ నాయకుల హామీలను ఎండగట్టాడు, రాయలసీమకి నీళ్లు, నిధులు,నిరుద్యోగ వ్యవస్థ మొదలైన హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు గుప్పించాడు. లోకేష్ అడుగుతున్నా ఏ ఒక్క ప్రశ్నకి వైసీపీనాయకుల దగ్గర సమాధానం లేకుండాపోయింది అని చెప్పాలి.