యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. సక్సస్ సాధించి మాస్ హీరో అనిపించుకున్నాడు. ఆతర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు.. చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే.. ఈ మాస్ హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ని అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లో పరిచయం చేసిన డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయకే.. బాలీవుడ్ లో కూడా పరిచయం చేస్తుండడం విశేషం.
టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఛత్రపతి మూవీ రీమేక్ తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వి.వి.వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం మరో విశేషం. ఈ సినిమాని రెండు నెలల క్రితం అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కోసం హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, డైరెక్టర్ వినాయక్ మకాం ముంబాయికి మార్చడం జరిగింది. అయితే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని కాంటాక్ట్ చేశారట చిత్ర నిర్మాతలు.
కైరా అద్వానీని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించేందుకు కాంటాక్ట్ చేస్తే.. నో అని చెప్పిందట. ఆతర్వాత దిశా పటానీ, అనన్య పాండే, శ్రద్ధా కపూర్ లను కాంటాక్ట్ చేస్తే.. వీళ్లు కూడా నో అని చెప్పడంతో ఈ సినిమా కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారిందట. మరి.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించేందుకు ఏ బాలీవుడ్ బ్యూటీ ఓకే చెబుతుందో..? ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.