43 Ministers Take Oath In Narendra Modi Cabinet :
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను పునర్వవస్థీకరించారు. ఇప్పటిదాకా తన మంత్రివర్గంలో కొనసాగిన 12 మందికి ఉద్వాసన పలికిన మోదీ.. కొత్తగా 36 మందికి అవకాశం కల్పించారు. అదే సమయంలో ఇప్పటిదాకా తన కేబినెట్ లో సహాయ మంత్రులుగా కొనసాగిన వారిలో ఏడుగురికి కేబినెట్ ర్యాంకు ఇస్తూ ప్రమోషన్ కల్పించారు. మొత్తంగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో 43 మంది మంత్రులతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
కొత్త మంత్రులు వీరే
1. నారాయణ రాణే
2. శర్వానంద సోనోవాలా
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వనీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పారస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరీ
11. మన్సుఖ్ మాండవ్య
12. భూపేందర్ యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌధురి
17. అనుప్రియ పటేల్
18. సత్యపాల్ సింగ్ బాఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖీ
24. అన్నపూర్ణా దేవి
25. నారాయణ స్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బి.ఎల్. వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవూసింగ్
31. భగవంత్ ఖూబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమా భౌమిక్
34. భగవత్ కృష్ణారావు
35. సుభాశ్ సర్కార్
36. రాజ్‌కుమార్ రాజన్ సింగ్
37. భారతీ పవార్
38. విశ్వేశ్వర్ తుడు
39. శంతనూ ఠాకూర్
40. మహేంద్ర భాయ్
41. జాన్ బర్లా
42. మురుగన్
43. నితీశ్ ప్రామాణిక్
ఉద్వాసనకు గురైంది వీరే..
వయసు మీద పడటం, పనితీరు, ఆయా రాష్ట్రాలు, సామాజిక వర్గాల సమీకరణలను బేరీజు వేసుకున్న మీదట మోదీ 12 మందికి తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. ఈ జాబితాలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, సదానంద గౌడ, సంతోష్ కుమార్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్ధన్, దేవశ్రీ చౌదరి, సంజయ్ ఛౌత్రే, బాబుల్ సుప్రియో, రావ్ సాహెబ్ ధన్వే పాటిల్, రతన్ లాల్ కటారియా, అశ్వినీ చౌబేలతో రాజీనామా చేయించారు. మిగిలిన వారిని పక్కనపెడితే.. మోదీకి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్ లకు ఉద్వాసన పలకడం కలకలం రేపుతోంది.
Must Read ;- తెలుగు నేలకు ఈ సారీ మొండిచెయ్యే!