విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకే సారి 55 మంది విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్ధులందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు కరోనా వ్యాప్తితో మూసి వేశారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోయినా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏపీలోనూ విద్యాసంస్థలు మూసి వేసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు విద్యార్థుల హాస్టళ్లలో కరోనా కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. తాజాగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులను కరోనా చుట్టుముట్టింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
టెస్టులు పెంచండి
ఏపీలో కరోనా టెస్టులు పెంచాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు రాబోయే నెల రోజుల్లో కోటి మందికి టీకా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే టీకా రెండు డోసులు తీసుకున్న రెండు వారాల వరకు కరోనా సోకే ప్రమాదముందని, అప్పటి వరకు అందరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా మరోసారి విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
Must Read ;- హస్టళ్లలో కరోనా కలకలం











