సోషల్ మీడియాలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. సూపర్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కొందరు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటే, ఇంకొందరు ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. మహేశ్ ఈ రెండింటిలోనూ దూకుడుగానే ఉంటారు. ఇన్ స్టాలో మహేశ్ ఇప్పుడు 6 మిలియన్ క్లబ్ లో చేరారు. ఇది ఆయన నటించిన ఏ టీజర్ కో, ట్రైలర్ కో వచ్చిన లెక్క కాదు. ఇది ఆయన ఇన్ స్టా గ్రామ్ లో ఆయనను ఫాలో అయ్యేవారి లెక్క. ఇంతమంది ఫాలోవర్లను సాధించుకోవడం మామూలు విషయం కాదు.

Also Read:-మహేష్ బాబు తల్లి గా జ్యోతిక ?
పైగా ఆయన ఇన్ స్టాలోకి వచ్చి ఎక్కవ కాలం కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలోనే ఇంత ‘దూకుడు’ ప్రదర్శస్తే ఆయన ‘ఆగడు’ కదా. అందుకే ఆరు మిలియన్ల ఫాలోవర్లతో ‘సరిలేరు నాకెవ్వరు’ అంటున్నారు. ఓ పక్క మహేశ్, ఇంకో పక్క ఆయన ముద్దుల పట్టి, మరో పక్క ఆయన సతీమణి.. అందరికీ సోషల్ మీడియా దూకుడు ఎక్కువే. సితార అయితే చిన్నప్పుడే సోషల్ మీడియా సూపర్ స్టార్ అయిపోయిందంటే నమ్మండి. నెటిజన్లు ఈ చిన్నారి చేసే సందడి చూసి ఫిదా అయిపోతుంటారు. త్వరలో మహేశ్ బాబు ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతారో వేచి చూడాల్సిందే.
Also Read:-సితార క్లాప్ తో మహేష్ ‘సర్కారు వారి పాట’ ప్రారంభం Must Read:-అడ్వాన్స్ తిరిగిచ్చేసిన ఉప్పెన దర్శకుడు.. నిజమేనా?












