సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రజనీకాంత్ ‘దర్బార్’ తో సౌత్ జనాన్ని పలకరించిన ఈ చిన్నది .. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఊపిరి సలపనంత బిజీగా ఉంది. ఆ జాబితాలో ఉన్న ఓ వైవిధ్యమైన సోషియో ఫాంటసీ డివోషనల్ మూవీ ‘మూక్కుత్తి అమ్మన్’ (ముక్కుపుడక అమ్మవారు). యన్.జె.శరవణన్ , ఆర్జే బాలాజీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆర్జే బాలాజీ హీరోగానూ, నయనతార అమ్మవారిగానూ నటిస్తున్నారు.
ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న హీరో జీవితంలోకి.. ఓ అమ్మవారు అడుగుపెడుతుంది. అప్పుడు జరిగే అనూహ్య పరిణామాలు కథను అనుకోని మలుపుతిప్పుతాయి. మౌళి, ఊర్వశి, శ్రుతి వెంకట్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్యపాత్రలు పోసిస్తోన్న ఈ సినిమాని అతిత్వరలో డిస్న్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ చేయబోతున్నారు. అలాగే.. దీపావళికి స్టార్ విజయ్ లో ఈ సినిమా ప్రీమియర్ షో టెలీకాస్ట్ అవబోతోంది. మూక్కుత్తి అమ్మన్ గా ఎంతో గంభీరంగా కనిపిస్తోన్న నయనతార పిక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా నయన్ కి ఏ రీతిలో విజయం అందిస్తుందో చూడాలి.











