July 5, 2026 4:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సంపాదకీయం : తెరాసకు దక్కేది చేదు విజయం!

దుబ్బాక ఉప ఎన్నికలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించవచ్చు గాక.. కానీ ఆ విజయాన్ని సంతృప్తిగా ఆస్వాదించే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకని?

November 9, 2020 at 7:04 PM
in Editorial, Latest News
Telangana CM KCR
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కోర్టులో దావా ఓడిన వాడు కోర్టు బయట ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడనే సామెత చాలా పాతది. కానీ.. అది నిత్యనూతనమైనది. వర్తమాన రాజకీయాలకు కూడా అచ్చంగా వర్తించేది. 

దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు, పోలింగ్ తర్వాత జరిగిన సర్వేలు కూడా తెరాసకే విజయావకాశాలు కట్టబెట్టాయి. సాధారణంగా పోలింగ్ తర్వాత జరిగే సర్వేల ఫలితాలు నిజానికి దగ్గరగా ఉంటాయనేది ఒక అంచనా. ఆ ప్రకారం కూడా తెరాసనే గెలుస్తుంది.  గులాబీ దళాలు మిఠాయిలు తినిపించుకుని పండగ చేసుకుంటాయి. అయితే గెలిచిన ఆనందం ఆ పార్టీలో పుష్కలంగా, నిజంగా ఉంటుందా? అంటే మాత్రం సందేహమే!

పాత చరిత్ర తిరగరాస్తారా?

2018 ఎన్నికల్లో తెరాస దుబ్బాకలో విజయదుందుభి మోగించింది. తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఏకంగా 62వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన మొత్తం ఓట్లలో తెరాసకు 54 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికీ కలిపి కేవలం 30 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఘన విజయం నమోదైంది. 

ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక. స్థానికుల్లో మంచి వ్యక్తిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం వల్ల జరుగుతున్న ఉప ఎన్నిక. ఇలాంటి ఎన్నికలో ఆయన కుటుంబమే ఢంకా బజాయించి గెలిచే అవకాశం ఎక్కువ. ఆయన కొడుకు కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ.. సానుభూతిని ఓట్లుగా  పిండుకోవడంలో భార్య అయితేనే బెటర్ అని పార్టీ భావించిందో ఏమో గానీ.. ఆయన భార్య సుజాతను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మామూలుగా అయితే.. వైరిపక్షాలు పోటీకి భయపడే స్థాయిలో ఇలాంటి ఉప ఎన్నిక ఉండాలి. కానీ అలా జరగలేదు. తెరాసలోనే ఉన్న చెరుకు ముత్యం రెడ్డి కొడుకు- అధికార పార్టీని వీడిపోయి మరీ, కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. నిజానికి ఆయన కూడా ఇదే తరహా సానుభూతిని నమ్ముకున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన, నిజాయితీపరుడిగా పేరున్న ముత్యంరెడ్డి మరణం వలన పుట్టే సానుభూతి లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. బీజేపీ తరఫున గత రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్ రావు.. ఇంకో రకం సానుభూతిని నమ్ముకుని కాస్త గట్టిగానే తలపడ్డారు. 

తెరాస అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే.. హరీష్ రావు మొత్తం బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పార్టీలో ఆయన తప్ప.. దుబ్బాక ఎన్నికల ప్రచారానికి రానివ్వకుండా గెలుపు కీర్తిని మొత్తం గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికే ఇలా చేశారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వేలు కూడా వచ్చాక ఒక సర్వేను మాత్రం పరిగణనలోకి తీసుకుని చూసినట్లయితే.. ఆరా సంస్థ చేసిన సర్వేలో తెరాసకు 48 శాతం, బీజేపీకి 44 శాతం ఓట్లు దక్కుతున్నాయి. ఓ మూడు శాతం అటుఇటు కావచ్చునని వారి అంచనా. 

చాలాసంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేసినా.. ఒక్క ఆరాను మాత్రం పరిగణనలోకి తీసుకోవడం ఎందుకంటే.. ఆ సంస్థ సారథి మస్తాన్ చెప్పే జోస్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా అపారమైన నమ్మకం ఉన్నదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో.. ఎవ్వరెన్ని చెప్పినా.. మస్తాన్ మాత్రం.. తెరాసకు 100 స్థానాలు దక్కుతాయని ముందే సర్వేలు చేసి కేసీఆర్‌తో అన్నారని, అప్పటినుంచి గులాబీ దళపతికి మస్తాన్ మీద అపరిమితమైన గురి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. కనుక వారి పోస్ట్ పోల్ సర్వేను ప్రమాణికంగా తీసుకుంటే.. ఈ గణాంకాలు కనిపిస్తున్నాయి. 

ఇలాగైతే విజయమూ అపశకునమే..

విజయం దక్కితే దక్కవచ్చు గానీ.. అధికార పార్టీ తెరాసకు వెన్నులో చలి పుట్టించే గణాంకాలు ఇవి. ఇలాంటి ఉప ఎన్నికలో పాత ఎన్నికకంటె ఎక్కువ ఓట్లు సాధిస్తేనే.. అది అధికార పార్టీకి పరువు దక్కిస్తుంది. కానీ.. పోటాపోటీగా ఫలితాలు వచ్చి.. కేవలం నాలుగు శాతం ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోతే.. తెరాసకు గెలిచిన ఆనందం కూడా దక్కదు గాక దక్కదు. 

గత ఎన్నికలతో పోలిస్తే.. తెరాస ఈసారి 8 శాతం ఓట్లు కోల్పోతున్నట్టు లెక్క. గత ఎన్నికల్లో కేవలం 13 శాతం తెచ్చుకున్న బీజేపీ ఈసారి 31 శాతం ఓట్లను అధికంగా సాధించినట్లు లెక్క. 2014లో ఆ పార్టీ సాధించిన 10 శాతం ఓట్లతో పోలిస్తే 34 శాతం మెరుగుపడినట్టు లెక్క. కాంగ్రెస్ పరిస్థితి యావత్ రాష్ట్రంలో ఉన్న తీరుగానే.. ఇక్కడ కూడా దయనీయంగా, మరింత దిగజారింది. గతంలో 16 శాతం ఓట్లు తెచ్చుకున్న వారు.. ఈసారి కేవలం 6 శాతానికి పరిమితం కాబోతున్నారు. 

మరి ఇలాంటి పరిస్థితిలో గెలిచిన ఆనందం తెరాసకు దక్కదు.. అనే మాట వాస్తవం. వారు గెలుపును బహిరంగంగా సెలబ్రేట్ చేసుకోగలరేమో గానీ.. అంతరంగంలో మాత్రం.. ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిందే. 

మంగళవారం మధ్యాహ్నానికి ఫలితాల గురించి స్పష్టత వచ్చేస్తుంది. మెజారిటీ తగ్గడం గురించి.. అందరూ హరీష్ రావును, అందుబాటులో ఎవరు దొరికితే వారు అనే రీతిలో ప్రతి తెరాస నాయకుడినీ ప్రశ్నిస్తారు. ఎంతమందిని అడిగినా.. వారందరూ మూకుమ్మడిగా చెప్పబోయే సమాధానాలు మాత్రం కామన్. ‘బీజేపీ విచ్చలవిడిగా డబ్బు పంచి ఓట్లు సాధించింది. పోలీసుల తనిఖీలో దొరికిన డబ్బు కట్టలే దీనికి సాక్ష్యం. ఎన్నికల్లో అనేక అక్రమాలకు వారు పాల్పడ్డారు. వారి పాపాలన్నీ విచారణలో తేలుతాయి. ప్రజలు తెలివైన వారు కాబట్టే కేసీఆర్ గారి మీద నమ్మకంతో తెరాసను గెలిపించారు..’ ఇలాంటి అనేకానేకమైన పరనింద ఆత్మస్తుతి డైలాగులు వెల్లువలా వస్తాయి.

వారు ఎన్నయినా చెప్పవచ్చు గాక.. ఈ దుబ్బాక ఎన్నికల గోదాలో బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే మాట మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. అలాగే.. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సి వస్తే.. ప్రజలకు కాంగ్రెస్ కంటె, బీజేపీ మెరుగ్గా కనిపిస్తోందని  కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి విపక్షాలు- గెలుపు ఆశలు తక్కువే అయినా.. బరిలోకి దిగింది కూడా బలం పెంచుకోవడం ద్వారా.. తతిమ్మా యావత్ రాష్ట్రానికి తెరాస పట్ల వ్యతిరేకత మొదలైందనే సంకేతం పంపడానికే- అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు.

అధికార పార్టీ కూడా గుర్తిస్తే.. ప్రభుత్వం పనితీరు మెరుగుపడుతుంది. ఈ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తే మాత్రం.. మరింత ప్రతికూలతను మూటగట్టుకుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకువస్తున్న తరుణంలో అది ఇంకా ప్రమాదకరమైన పరిణామం.

.. సురేష్ పిళ్లె
kamspillai@gmail.com

Tags: bjpcongressdubbaka bypoll election campaigndubbaka bypoll election resultdubbaka bypoll elections 2020dubbaka victoryleotoptelangana latest newstelangana newstelangana news livetelangana news update todaytelugu newstrsTRS celebrationTRS victory in dubbaka
Previous Post

దుబ్బాకలో బీజేపీని ముందే గెలిపించిన వికీపీడియా!

Next Post

యూట్యూబ్ లోకి ‘రానా’ అంటూనే వచ్చేశారు

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

Shocking & Tragedy – Boy dies while swimming in well, with electric shock

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist