నెల్లూరు మంత్రి వర్యులు మైక్ ముందుకొస్తే చాలు ఏం మాట్లాడుతారో అని భయపడాల్సివస్తుంది. చెవులు వినలేని మాటలు కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అందుకు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే, ప్రవర్తన మార్చుకుని నోరును అదుపులో పెట్టుకోవడం లేదు. తాజాగా ఓ దినపత్రికను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చెవులు మూసుకోవాల్సిందే!
పార్టీవాళ్లు తనకు దూరమయ్యారని ఓ పత్రిక పేర్కొందని చిందులు వేశారు. మా పార్టీ , మా మనుషులు, ఇది మా కుటుంబం లాంటిది అంటూ చెప్పుకుంటూ పోతున్నారు. మా కుటుంబం లాంటి పార్టీ గొడవల గురించి పత్రికలో పెద్ద కాలమ్ లు పెట్టి మరీ రాయడానికి మీడియా బాధేమిటో అని వాపోయారు. మా కుటుంబం లాంటి పార్టీ దరిద్రమైనది అని రాసినా ఓకే అంటున్నారు. అదే నిజమైనా సరే నీకేం బాధంటూ పత్రికను ప్రశ్నిస్తున్నారు. తన గురించి రోజూ రాసుకున్నా తననేం చేయలేరంటూ చెప్పుకొచ్చారు. పత్రికను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
పత్రికనే కాకుండా, పార్టీలోని గొడవల గురించి రాసినందుకు విలేకరిని కూడా నిందించారు. దమ్ముంటే 365 రోజులు, 24 గంటలూ తన గురించి రాసిన భయపడనని సదరు పత్రికకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏం పీకుతావ్ అంటూ చెప్పరాని మాటలు మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్, అనుచరులు రౌడీలు, అవినీతి పరులు, గూండా అని రాసుకో, నన్నేం చేయలేవు అంటున్నారు మంత్రి. నీ రాతల్తో మా తలరాతనేం చేయలేవు అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని మాటల రూపంలో రాయలేని వ్యాఖ్యలు కూడా చేశారు.
Must Read ;- నిన్న సాక్షి చేసినదే నేడు న.తె. చేస్తోంది!
గప్ చుప్..
ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికైనా సరే ఏదైనా పార్టీలోని లుకలుకల గురించి ప్రజలకు తెలియజేయడం సహజం. పార్టీలోని గొడవల గురించి రాసినందుకు మంత్రి గారికి బాగా కోపం వచ్చినట్టుంది. అందుకోసం మీడియా సమావేశం పెట్టి తన ఆవేశాన్ని అణుచుకుని మరీ కాస్త వెటకారాన్ని జోడించి మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ పార్టీ గొడవల గురించి బయటపెట్టినందుకు బాగా కోపం వచ్చినట్టు తనకు తానే బయటపెట్టుకుంటున్నాడనే విషయాన్ని మర్చిపోయారు పాపం.
అంతేనా, పార్టీ గొడవులున్నాయని సదురు పత్రిక అనుమానాలు వ్యక్తం చేస్తే, ఇప్పుడు మంత్రి వర్యులు ఒప్పుకుని వారి మాటల్ని నిజం చేశారు. స్వయంగా పార్టీ లుకలుకల్ని మీడియా సముఖంగా తనకు తానే బయటపెడుతున్నాననే విషయం కూడా అర్థం కాకపోతే ఎలా? ఏవో రాతలు రాసారని పత్రికను కించపరుస్తున్నాం అనుకున్నారే తప్ప తమ పార్టీ గొడవల్ని బయటపెట్టి పార్టీ పరువు తీస్తున్నాం అనే స్పృహ కూడా లేకుండా పోయింది.
Also Read ;- ఈ తలనొప్పి యవ్వారం నాకెందుకు : మంత్రిలో భయం!
అనిల్ తిట్టిన అసలు బూతులన్నీ వినాలంటే ఈ వీడియో చూడండి :











