ప్రస్తుతం కరోనా విషయం కాస్త పక్కకు పోయింది. కొత్తరూపు దాల్చిన కరోనా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. భారత్ లో మాత్రం నేటికి కూడా ఎక్కడా కొత్తరకం కరోనా కేసు నమోదైనట్లు అధికారక ప్రకటన విడుదల కాలేదు. యుకే నుంచి వచ్చిన ప్రయాణికులలో కొందరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన మాట మాట నిజమే కానీ.. కొత్తరకం కరోనా కనుగొన్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు. కానీ ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్నట్లు అయిపోయింది వ్యవహారం. ప్రభుత్వాలు ఒక పక్క వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించడంలో బిజి బిజిగా ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ కొత్త కరోనా అందరినీ కంగారుకు గురిచేస్తుంది. దాని గురించి కొందరు నిపుణులు కంగారు పడాల్సిన లేదని.. దానిపై వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

Must Read ;- భారత్‌లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు
కంగారు పడకండి.. వ్యాక్సిన్ పనిచేస్తుంది..
కరోనా జరిగిన కొత్తరకం మార్పుల వల్ల సెల్స్‌లోకి సులభంగా చొచ్చుకుపోయే గుణాన్ని సంతరించుకుంది. ఈ కారణంగానే కరోనాతో పోలిస్తే.. కొత్తరకం కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ, కరోనా మార్పులు చెందినంత మాత్రానా వ్యాక్సిన్ పనిచేయదని భావించలేమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. పరిశోధనల ప్రకారం కొత్తరకం కరోనా పిల్లలపై.. యువతపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొత్తగా పాటించాల్సినవేమీ లేదని కరోనా సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు వహించామో.. అలాగే ఇప్పుడు కూడా అవే పాటిస్తూ కరోనా కట్టడి చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చికిత్సలో మార్పులు అవసరంలేదు..
కొత్తరకం కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్) అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి కరోనా గురించి పరిణామాల గురించి చర్చించారు. కొత్త రకం కరోనా కేసులు నమోదైతే చికిత్సలో మార్పులు చేయాలా.. టెస్టింగ్‌లు ఎలా ఉండాలి.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి విషయాల గురించి చర్చించారు. చర్చల అనంతరం వారు ప్రకటించిన సమాచారం ప్రకారం.. చికిత్సలో ఎటువంటి తీసుకోవడం లేదని వెల్లడించారు. కానీ, కొత్తరకం కరోనాకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రం తెలిపారు. యుకే దేశం నుండి వచ్చిన ప్రయాణికులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. యుకే పాజిటివ్ కేసులను ప్రత్యేక టెస్ట్ ద్వారా కొత్తరకం కరోనాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.
Also Read ;- కొత్తరకం కరోనా… వైరస్ లక్షణాలు ఏంటి? జాగ్రత్తలు, ఆహారం గురించి తెలుసుకోండి..











