చంద్రబాబు దార్శినికత, దూరదృష్టి, ముందుచూపు గురించి ప్రత్యకించి చెప్పాల్సిన పనిలేదు. 1999-2004 లో సిఎంగా ఉన్న హయాంలో హైదరాబాద్ దశను మార్చారు చంద్రబాబు. తన విజనరీతో ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్.. ఇలా ఒకటి, రెండు కాదు.. హైదరాబాద్ రూపురేకల్ని మార్చిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. తాను వేసిన విత్తనమే నేడు వృక్షమై ఫలాలు అందిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.
బిజినెస్ స్కూల్స్‌లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2001లో చంద్రబాబు హయాంలో ప్రారంభించారు. అది మొదలుపెట్టిన సందర్భంలో చంద్రబాబుతోపాటు, ఆనాటి దేశ ప్రధాన మంత్రి వాజ్ పేయి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో ISB పోస్ట్ చేసి 2001 హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఫొటోలోని వ్యక్తులను ఉద్దేశిస్తూ.. ‘ఐఎస్‌బి ప్రాజెక్ట్ విజయవంతమవుతుందని ఆనాడే గుర్తించి ప్రోత్సహించిన వ్యాపార దిగ్గజాలకు మా కృతజ్ఞతలు.’
#ThrowbackThursday #WalkDownTheMemoryLane
"Business visionaries who thought ahead of their time and piloted the ISB project." 🙏🏻
Year 2001: Inauguration of ISB's Hyderabad campus #ISBJourney #ISBDay #ISBis20 pic.twitter.com/tupa7JyhiA
— Indian School of Business (ISB) (@ISBedu) January 21, 2021
Must Read ;- సరికొత్త ప్రారంభానికి చంద్రబాబు దిశానిర్ధేశం
దానిపై చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘ప్రపంచంలో అత్యుత్తమ విద్యను అందించే సంస్థల్లో ఐఎస్‌బి ఒకటని పేర్కొన్నారు. అటల్ బిహారి వాజ్ పేయి, ఎందరో వ్యాపార దిగ్గజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు’.
On a piece of land I'd earmarked stands a world-class higher education institute driven by a meritocratic culture. Privileged to have worked with Atal ji and all the business tycoons who made it possible. Keep shining, @ISBedu! https://t.co/rNWTxXcgzO
— N Chandrababu Naidu (@ncbn) January 22, 2021
Also Read ;- జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు
దీనిపై తిరిగి స్పందించిందిన ఐఎస్‌బి ‘మీ అభినందనలకు మా కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం, సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటాము.’ అంటూ చంద్రబాబు ట్వీట్‌కు సమాధానమిచ్చారు.
Thank you for your warm wishes, Shri @ncbn garu. We fondly remember your support to us. https://t.co/xKggpOAPTH
— Indian School of Business (ISB) (@ISBedu) January 22, 2021
ఇది ఓ మచ్చుతునక మాత్రమే..
ఇదే కాదు.. చంద్రబాబు హయంలో జరిగిన అభివృద్ధి కారణంగానే నేటికీ హైదరాబాద్ విశ్వ నగరంగా విరాజిల్లుతుందనేది కాదనలేని సత్యం. హైదరాబాద్‌లో IT ఆద్యుడిగా, టెక్నాలజీని ప్రవేశపెట్టిన వ్యక్తిగా చంద్రబాబు కృషి చిరస్మరణీయం. విద్యాలయాలు కొరవడి పక్క రాష్ట్రాలపై మన విద్యార్ధులు ఆధారపడుతున్న సమయంలో మన రాష్ట్రంలో ఎన్నో విద్యాలయాలకు పునాది వేశారు. అంతేకాదు, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నుంచి వేరే రాష్ట్రాల వారు హైదరాబాద్‌లో ఏదో ఒక పనిచేసుకుని బతకచ్చులే అనుకునేంతగా నగర అభివృద్ధికి కృషి చేశారు. నేటికీ రాష్ట్రాన్ని నడపాలంటే.. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన పాత్ర పోషిస్తుందని కాదనలేని సత్యం.











