June 29, 2026 12:27 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జీవీఎల్ వ్యాఖ్యలతో రగిలిపోతున్న ఓటర్లు..  విశాఖలో బీజేపీ అడ్రస్ గల్లంతేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఫలితాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే విశాఖలో బీజేపీకి పడుతుందని అంటున్నారు.

March 5, 2021 at 3:09 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

 కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఉంది ఏపీలో బీజేపీ పరిస్థితి. జనసేన- బీజేపీ పొత్తు పంచాయతీ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలను రాబట్టగలిగింది. అదే ఊపు మీద గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ) ఎన్నికల్లోనూ సత్తా చాటాలి అనుకున్నా ఆ పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదేమో అనిపిస్తోంది. గత మూడు రోజులుగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో చాలా హడావిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల పైన, మీడియాపైన తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తున్నా, ఆ ఫలితం ప్రజల నుంచి రావడంలేదని, తగిన ప్రచారం కల్పించడంలో మీడియా ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందని తన ఆవేదనంతా వెళ్లగక్కారు. అక్కడి వరకు బాగానే ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయేలా ఫలితాలు వెలువడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే విశాఖలో బీజేపీకి పడుతుందని అంచనా వేస్తున్నారు.

బీజేపీ రెండు నాల్కల ధోరణి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోంది. కేంద్ర బీజేపీ నాయకులు ఒక రకమైన ప్రకటనలు చేస్తుంటే, రాష్ట్ర నాయకులు మరో విధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టేశారు . జాతీయ నాయకురాలు పురందేశ్వరి, ఎమ్మెల్సీ pvn మాధవ్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కేంద్రం ప్రకటనపై విశాఖ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత రాకుండా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా, అధిష్ఠానం ఆగ్రహానికి గురికాకుండా సమతూకం పాటిస్తూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కేంద్రం నిర్ణయం ఏదైనప్పటికీ… ‘ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ సెంటిమెంట్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా, ఇక్కడి ప్రజల మనోభావాలు వారికి అర్థమయ్యేలా వివరిస్తామని ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చారు. గత నెల ఉద్యమం ప్రారంభమైన తొలి నాళ్లలో ఈ బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఇవి. ఉద్యమం తీవ్రతరం అవుతున్న కొద్దీ… బీజేపీ నేతలు ఈ అంశంపై ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా సమావేశాలు తగ్గించేశారు. విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడటం మానేశారు. దీంతో ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతున్నా అది బహిర్గతం కాలేదు.

ఊపందుకున్న ఎన్నికల వేడి..

ఒకవైపు ఉక్కు ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుండగా, మరోవైపు జివిఎంసి ఎన్నికలకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యమం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఈ క్రమంలో జనసేనకు మంచి అభిమానులున్న విశాఖలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ, జీవీఎల్ వ్యాఖ్యల కారణంగా… ఆ అవకాశాలు మృగ్యం అయినట్టు భావించాల్సి వస్తోంది.

Must Read ;- నాడు జీవిఎల్.. నేడు విష్ణు.. ‘చెప్పు’కోక తప్పదు

ప్లాంట్ ప్రైవేటీకరణతోనే అభివృద్ధి..

తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మూడు రోజులుగా విశాఖలో పర్యటిస్తున్నారు. జనసేన– బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో చేసిందని, లెక్కలతో సహా వివరించడం ప్రారంభించారు. ఇక విశాఖ విషయానికి వస్తే, తొలి స్మార్ట్ సిటీగా ప్రకటించిన నాటి విషయాలు మొదలుకొని.. విశాఖ – చెన్నై కారిడార్ వల్ల కలిగే లాభాల వరకు ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్టులను పనిలోపనిగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఎన్ఏడి కొత్త రోడ్‌లోని ఫ్లైఓవర్ సందర్శించి, డిజైన్‌లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందో లేదో కనుక్కొని తీరుతానన్నారు. ప్రతిష్టాత్మక నగరంలో ఇటువంటి వంతెన ఎలా నిర్మిస్తారని, ఈ విషయంలో గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపి ప్రభుత్వాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ వంతెన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకుంటూ వచ్చారు.

సార్ అంతటితో ఆగి ఉంటే బాగుండేది.. స్టీల్ ప్లాంట్ అంశంపై విలేకరులు ప్రశ్నించగానే, ఏదో గోడ మీద పిల్లి వాటంలా  సమాధానం చెప్పకుండా, తాను నిజాలే మాట్లాడతానని పదేపదే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టు పలు స్టేట్మెంట్లు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? ప్రైవేటు యజమాన్యం చేతుల్లోకి వెళితే ఇంకా సమర్థంగా పనిచేయగలదని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రైవేటీకరణ ఇంత త్వరగా జరగబోదని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే మరో 42 పరిశ్రమలు ఈ జాబితాలో ఉన్నాయని, వాటి తర్వాత స్టీల్ ప్లాంట్ వంతు వస్తుందని సెలవిచ్చారు ఎంపీ జీవీఎల్. పోనీ అంతటితో ఆగారా అంటే… మరో అడుగు ముందుకేసి, స్టీల్ ప్లాంట్ పిఎస్‌యూగా కొనసాగితే, అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, అవినీతి అధికారులకు లాభిస్తుంది తప్ప మరే ఉపయోగం లేదన్నారు. ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన పరిశ్రమ ఇక్కడి నుంచి ఎక్కడకు వెళ్లదని, పైగా మరింత అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. గత ప్రభుత్వాలు అవే కొరియాకు చెందిన సంస్థలను తీసుకువస్తే స్వాగతిస్తారు గాని, తాము తీసుకొస్తే వ్యతిరేకిస్తారా అంటూ ఎదురుప్రశ్న వేస్తున్నారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని నేరుగానే చెప్పేశారు.

మండిపడుతున్న ఓటర్లు..

ప్రాణ త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో పెట్టేందుకు కంకణం కట్టుకున్న బీజేపి పేరు చెబితే నేడు విశాఖ ఓటర్లు మండిపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ  నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జివిఎంసి ఎన్నికల్లో బీజేపీపై ఈ ప్రభావం ఏ మేరకు చూపుతుందో వేచి చూడాలి మరి!

Must Read ;- ఆందోళనలు చేస్తున్నా.. విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

Tags: ap newsap politicsbjpbjp apbjp gvl narasimha raobjp mp gvl narasimha raoBusiness Newschandrababu speech in vizagchandrababu vizagEditorspickG.V.L. Narasimha Raoganta srinivasa raoGovernmentgvl coments on steel plant effect bjp in vizagGVL Narasimha Raogvl narasimha rao interviewgvl narasimha rao press meetjaganleotopMunicipal Corporationprivatisation of vizag steel plantprivatisation of VSPsale of VSPtdptelugu newstelugudesamthe debatevenkata krishnavenkata krishna debate todayvijaya sai reddyvijayasai reddyvisakhapatnamVisakhapatnam Steel Plantvizagvizag newsVizag SteelVizag Steel Plantvizag steel plant issuevizag steel plant privatizationVSPysrcpysrcp vizag
Previous Post

ప్లే బ్యాక్ (రివ్యూ)

Next Post

భయపెట్టనున్న ‘క్రాక్’ జయమ్మ

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist