June 24, 2026 11:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 6, 2021 at 6:26 PM
in Editors Pick, General, National
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన తన వారసుడిగా సీనియార్టీ ప్రకారం ఎన్వీ రమణను ప్రతిపాదిస్తూ నిబంధనల ప్రకారం కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడింది. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రెండో వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. అంతుకు ముందు జస్టిస్ కోకా సుబ్బారావు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి..

ఇక జస్టిస్ ఎన్వీ రమణ విషయానికి వస్తే.. సుప్రీంకోర్టు సీజేగా 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. వివిధ హోదాల్లో పని చేశారు. 1983 ఫిబ్రవరి 10న బార్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్ 27న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు.

అవాంతరాలు అధిగమించి..

తన ప్రాంతానికి చెందిన వారికి దేశంలో అత్యున్నత పదవి లభిస్తుందంటే.. సాధారణ పరిస్థితుల్లో అంతా హర్షిస్తారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేస్తూ సీజేకు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా బహిర్గతం చేసింది వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడంతోపాటు అమరావతిలో ఆయన సంబంధీకులు భూములు కొన్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపిన సుప్రీంకోర్టు అన్ని అంశాలు పరిశీలించాకే జస్టిస్ ఎన్వీ రమణను సీజేగా సిఫారసు చేస్తున్నామని ప్రకటించింది.

Must Read ;- ఎన్వీ రమణకు లైన్ క్లియర్.. జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

కక్ష పూరిత ఆరోపణలేనంటూ..

అయితే ఇవి వైఎస్ జగన్ కక్ష పూరితంగా చేసిన ఆరోపణలేనని కొన్ని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఆరోపణల వెనుక గతంలో దేశ స్థాయిలో ఒక పవిత్రమైన విభాగంలో సేవలందించిన వ్యక్తి కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన సంబంధీకులకు ఏపీ ప్రభుత్వంలో అడిషనల్ హోదా కూడా వచ్చింది. తనకు రాని అవకాశం తన ప్రాంతానికి చెందిన వ్యక్తికే వస్తుంటే ఇలా ఎందుకు చేస్తారు అనే ప్రశ్నతో పాటు అనుభవం జాస్తి..అత్యున్నత హోదా నాస్తి చర్చకూడా రాజకీయాల్లో నడిచింది. మొత్తం మీద ఎన్ని అవాంతరాలు ఎదురైనా జస్టిస్ ఎన్వీ రమణ సరోన్నత న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. ఇక కేవలం సీనియార్టీ ప్రకారమే జస్టిస్ ఎన్వీ రమణకు ఈ హోదా దక్కనుందనుకుంటే పొరపాటే. ఆయన ఇచ్చిన తీర్పులు, అంకితభావం కూడా తోడయ్యాయని చెప్పవచ్చు. తన కెరియర్లో దాదాపు 13వేలకుపైగా కేసులను పరిశీలించిన ఆయన ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే..మహిళల విషయంలో జస్జిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పు..ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గృహిణుల శ్రమ..భర్త ఆదాయం కంటే ఎక్కువే..

2014లో ఢిల్లీలో ఓ ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త లెక్చరర్ కాగా భార్య గృహిణి. అయితే అప్పటికే బీమా ఉన్నప్పటికీ బీమా సంస్థ పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడంతో బాధిత కుటుంబానికి చెందినవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ కుటుంబానికి రూ. 40.17 లక్షల బీమా పరిహారాన్ని ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే చనిపోయిన వ్యక్తి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అంత బీమా పరిహారం రాదని, కేవలం ఒకే సంపాదనపరుడు ఆ కుటుంబంలో ఉన్నాడని బీమా సంస్థ వాదించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ అనంతరం పరిహారాన్ని రూ. 22 లక్షలకు తగ్గిస్తూ తీర్పు వెలువడింది.

బాధిత కుటుంబం సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు చేస్తున్న శ్రమను కూడా ఆదాయంగానే పరిగణనలోకి తీసుకోవాలని, ఇంటి పని చేయడంలోనూ శ్రమ ఉందని, కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా, వారి ఉద్యోగ, ఉపాధి మార్గాలకు సహకరించేలా గృహిణులు శ్రమపడుతున్నారని వ్యాఖ్యానించడంతోపాటు గృహిణులకు ఆదాయం లేదనే వాదనకు అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. గృహిణి చేస్తున్న చాకిరిని విస్మరించలేమని, కచ్చితంగా ఆదాయంగానే తీసుకోవాలని సూచిస్తూ సదరు బీమా కంపెనీ రూ.30.20 లక్షలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తుది తీర్పు ఇచ్చింది. అంతేకాదు..ఈ మేరకు మార్గదర్శకాలను కూడా ఖచ్చితంగా రూపొందించాలని బీమా సంస్థలకు పరోక్షంగా సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మహిళలు చేసే ఇంటిపని భర్త చేసే ఉద్యోగానికి ఏమాత్రం తక్కువ కాదని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. జస్టిస్ ఎన్వీ రమణ 2001లోనూ లతా వాధ్వా కేసులో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మనదేశంలో పురుషుల కన్నా స్త్రీలే ఇంటి పనులు ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో కుటుంబంలో మంచి చెడులను భుజాన వేసుకుంటారని, ఆహారం, దుస్తులు, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లల అవసరాలను చూడటం, వస్తున్న ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నిర్వహించడం వంటివి సవాళ్లతో కూడుకున్నవేనని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ఇక మరికొన్ని తీర్పులు పరిశీలిస్తే..

సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్, 2019 కేసులో సుప్రీంకోర్టు సీజే కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. 2016లో నబమ్ రెబియా, బమాంగ్ ఫెలిక్స్ VS డిప్యూటీ స్పీకర్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసం. ముఖ్యమంత్రి, మంత్రి మండలి, స్పీకర్‌లను సంప్రదించకుండా అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలంటూ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవల నిలిపివేత జరిగింది. ఈ కేసులో ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్ కేసులో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.  ఎండీ.అన్వర్ వర్సెస్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, 2020 కేసులో మానసిక అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడం వంటి కేసుల్లో కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించాలని తీర్పు చెప్పారు. జస్టిస్‌లు ఎన్.వీ.రమణ, ఎస్.ఏ నజీర్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం మానసిక రుగ్మతలకు నిర్వచనాన్ని వివరించింది. ఇవే కాదు.. రాష్ట్ర-కేంద్ర పన్నుల వివాదం, నదీ జలాల వివాదాలు, రాష్ట్రాలకు ఆర్థిక అంశాల్లో స్వేచ్ఛ తదితర అంశాల్లో కీలకమైన తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఎన్వీ రమణ కూడా కీలకంగా వ్యహరించారు.

Also Read ;- ఇలా జరుగుతుందని తెలిసే.. జగన్ అలా చేశారా?

Tags: 48th justicecheisf justice nv ramana supreme court cheif justice nv ramanaChief Justice of Indiacjicji full formcji meansEditorspickfacing all obstructions in his efficiancy justice nv ramana became cjifacing all obstructions justice nv ramana became cjihyderabadjustice nv ramanajustice ramanajustice ramana updatesn.v. ramananews about justice ramananv ramana 48th supreme court justicenv ramana became cjinv ramana wikiSharad A. BobdeSharad Arvind Bobdesupreme courttelugu newsthe leo news leo political news ap newswho is supreme court justiceY.S. Jaganmohan Reddy
Previous Post

సీఎస్ సోమేశ్ కు కరోనా : ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే!

Next Post

అమర జవానుకు కన్నీటి వీడ్కోలు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist