భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ ను వైద్య, ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడవకముందే ఆయన తెలంగాణ కేబినెట్ నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు సంబంధం లేదని భూముల్లో విచారణ జరిపారని, కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ఎలాంటి సమగ్ర విచారణ చేయకుండానే చర్యలు తీసుకోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు విచారణ జరిగిందని అన్నారు. సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులేనన్నారు. ఎప్పుడూ చిల్లర పనులు చేయలేదని ఈటల పేర్కొన్నారు. సాగర్‌లో కేవలం కేసీఆర్ ప్రచారం వల్లే గెలవలేదన్నారు. కార్యకర్తలందరి సమిష్టి కృషి వల్లే పార్టీ గెలిచిందన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందని గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఈటల.
హైదరాబాద్ నుంచి ఏపీకి.. రివర్స్ మైగ్రేషన్..! బాబు సర్కార్ సూపర్ ..!
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్...











