హెడ్డింగ్ ను చూసి.. ఇద్దరు వెంకటేశ్ లేంటా అని ఆశ్చర్యపోకండి. అందులో ఒకరు విక్టరీ వెంకటేశ్ అయితే.. మరొకరు వెంకటేశ్ మహా అన్నమాట. ‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వరా ఉగ్రరూపస్య’ లాంటి సినిమాలతో అందరి ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహా.. ప్రస్తుతం రాజశేఖర్ తో ‘మర్మాణువు’ అనే వెరైటీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు.
ఇదిలా ఉండగా.. వెంకటేశ్ మహా త్వరలో విక్టరీ వెంకటేశ్ తో కూడా సినిమా రూపొందించబోతున్నాడని సమాచారం. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం కాదట. ఓటీటీ రిలీజ్ కోసమట. ఆమేరకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను తెరకెక్కించడానికి మంచి బడ్జెట్ ఇచ్చిందట. మోహన్ లాల్ తో ఇటీవల ‘దృశ్యం 2’ రూపొందించిన తరహాలోనే అమెజాన్ ప్రైమ్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తోందట.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పాండమిక్ పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం వెంకీ ‘నారప్ప, ఎఫ్3, దృశ్యం 2’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు ప్రాజెక్ట్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వెంకీ ఈ సినిమా పై ఫోకస్ చేస్తాడట. మరి వెంకీని మహా ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.











