Balakrishna and Boyapati Akhanda Movie Final Schedule Resumes :
నందమూరి నటసింహాం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించింది. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది. నేడు (జూలై 12) హైద్రాబాద్‌లో అఖండ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇక ఈ షెడ్యూల్‌తో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి అఖండ గెటప్ లో ఉన్న బాలకృష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సీన్ వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి. ఈ భారీ చిత్రం అఖండ అందరి అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ సక్సస్ సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- అటు ఆచార్య ఇటు అఖండ;











