June 28, 2026 11:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ త‌న కెరీర్ లోనే తొలి సారి అరెస్ట్ అయిన వైనం న‌వ్యాంధ్ర‌ను షేక్ చేసింద‌నే చెప్పాలి.

August 16, 2021 at 4:15 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
AP Shakes With Nara Lokesh First Arrest
Share on FacebookShare on TwitterShare on WhatsApp

AP Shakes With Nara Lokesh First Arrest : 

నారా లోకేశ్‌.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా పార్టీ త‌ర‌ఫున జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌ను తిప్పికొట్టే శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగానూ కొన‌సాగుతున్నారు. క్రియాశీల రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కముందే.. పార్టీలో కార్య‌క‌ర్త‌ల సంక్షేమ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌నిచేసి త‌న‌దైన గుర్తింపు సంసాదించుకున్న నేత‌. ప‌దిహేనేళ్ల‌కు పైబ‌డిన కెరీర్ లో లోకేశ్ అరెస్టైన సంద‌ర్భ‌మే లేదు. అయితే ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. సోమ‌వారం నాడు లోకేశ్ ను అకార‌ణంగా అరెస్ట్ చేసింది. పోలీస్ వ్యాన్ ఎక్కించింది. పోలీస్ స్టేష‌న్ లో కూర్చోబెట్టింది. అస‌లు అరెస్ట‌య్యే త‌ప్పే లోకేశ్ చేయ‌న‌ప్పుడు ఆయ‌న‌ను ఎలా అరెస్ట్ చేస్తార‌న్న వాద‌న‌లు సామాన్య జ‌నం నుంచి వినిపిస్తుంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం పోలీసుల తీరుతో పాటు జ‌గ‌న్ స‌ర్కారు దుందుడుకు వైఖ‌రిపై త‌మ‌దైన శైలిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. వెర‌సి లోకేశ్ తొలి అరెస్ట్ న‌వ్యాంధ్ర‌ను షేక్ చేసింద‌నే చెప్పాలి.

అరెస్ట్ కు కార‌ణాలున్నాయా?

గుంటూరులో ఆదివారం నాడు బీ టెక్ విద్యార్థిని ర‌మ్య‌ను శివ‌కృష్ణ అనే ప్రేమోన్మాది అతి కిరాత‌కంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ప‌గ‌లు, న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండగానే జ‌రిగింది. అయితే ఈ వీడియో ఫుటేజీ విడుద‌ల‌లో పోలీసులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే జాప్యం చేశారు. నిందితుడిని ప‌ట్టేసుకున్న త‌ర్వాత సోమ‌వారం ఉద‌యం ఫుటేజీని విడుడ‌ల చేశారు. ఈ ఫుటేజీ చూసిన వారంతా.. ర‌మ్య‌పై జ‌రిగిన దాడి, ఆ దాడిలో ఆమె త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు చేసిన పోరాటం, అయినా నిందితుడి దుర్మార్గంపై దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఇక బాధ్య‌త క‌లిగిన విప‌క్షంగా టీడీపీ త‌న‌దైన శైలిలో ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్ర హోం మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జ‌రిగితే.. ఇక రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ఎలాంటి రక్ష‌ణ ఉంది అంటూ నిర‌స‌న‌ల‌కు దిగింది. ఈ క్ర‌మంలో పార్టీ నేత‌ల‌తో క‌లిసి లోకేశ్.. ర‌మ్య మృత‌దేహానికి నివాళి అర్పించ‌డంతో పాటుగా బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరారు. అయితే ఎక్క‌డిక‌క్కడ లోకేశ్, టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్న పోలీసులు ఒకానొక ద‌శ‌లో మాజీ మంత్రి న‌క్కా ఆనంద‌బాబుపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన లోకేశ్.. పోలీసుల తీరును తూర్పార‌బ‌ట్టారు. అస‌లు తాము చేసిన త‌ప్పేంట‌ని, విప‌క్ష నేత‌లుగా బాధితురాలి కుటుంబాన్ని కూడా ప‌రామ‌ర్శించే హ‌క్కు కూడా త‌మ‌కు లేదా అంటూ నిల‌దీశారు. ఈ సంద‌ర్భంగానూ పోలీసుల వైఖ‌రి మార‌క‌పోవ‌డంతో లోకేశ్ వారితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అప్ప‌టికే ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు అక్క‌డికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ప‌రిస్థితులు చేజారిపోతాయ‌న్న కార‌ణం చూపి లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. అంటే.. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డ‌మే లోకేశ్ చేసిన త‌ప్ప‌న్న మాట‌.

భ‌గ్గుమ‌న్న జనరల్ పబ్లిక్

నారా లోకేశ్ అరెస్ట‌య్యార‌న్న స‌మాచారం అంద‌గానే.. టీడీపీ శ్రేణులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్క‌డిక్క‌డ పోలీసుల తీరును నిర‌సిస్తూ ధ‌ర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు పోలీసుల తీరును ఖండిస్తూ ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేయ‌డంతో పాటుగా ప్ర‌త్య‌క్షంగా రోడ్ల‌పైకి వ‌చ్చి మ‌రీ నిర‌స‌న‌ల్లో పాలుపంచుకున్నారు. అస‌లు లోకేశ్ ఏం త‌ప్పు చేశార‌ని ఆయ‌న‌ను అరెస్ట్ చేస్తారంటూ పోలీసులు, జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. టీడీపీ శ్రేణులు చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో సామాన్య జ‌నం కూడా పాలుపంచుకున్నారు. సోమ‌వారం ఉద‌యం నుంచి గుంటూరులో నెలకొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు, ర‌మ్య‌పై జ‌రిగిన దాడి దృశ్యాలు, ప్ర‌భుత్వ స్పంద‌న‌, స్వ‌యంగా హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత ప‌రిహారం ప్ర‌క‌టించి చేతులు దులుపుకున్న‌ట్లుగా క‌నిపించిన వైనంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. వెర‌సి లోకేశ్ అరెస్ట్ ఏపీని షేక్ చేసింద‌నే చెప్పాలి.

Must Read ;- నారా లోకేశ్ అరెస్ట్.. టీడీపీ నేత‌ల‌పై ఖాకీ చేయి

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh GunturAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsAP Shakes With Nara Lokesh First Arrestbtech student murderchandrababu today newscongresscrime newsdalitEngineering student stabbed to death in Andhra Pradeshfirst arrestGuntur Government General hospitalguntur latest news updatesGuntur student Ramyaguntur urbanLatest Newslatest news in guntur district todayLatest Telugu Newslatest telugu news onlineleotoplokesh arrestlokesh arrest first time in political careerlokesh in gunturnara lokeshnara lokesh arrestnara lokesh arrest newsnara lokesh arrest videoNara Lokesh First Arrestramya murderstabbed to deathtdptdp cadretdp leader nara lokesh arresttelugu newsToday news VijayawadaVijayawada latest newsVijayawada newsVijayawada news livevijayawada news todayviral news in apwoman commissionYS Jagan Mohan Reddyఆంధ్రప్రదేశ్ఏపీ న్యూస్ఏపీ వార్తలుతాజా వార్తలుతెలుగు వార్తలునారా లోకేష్బీటెక్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్రాజకీయ కెరీర్ లో తొలిసారి నారా లోకేష్ అరెస్ట్హత్య జరిగిన స్పాట్ కు వెళ్లేందుకు యత్నంచిన లోకేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
Previous Post

ధిక్కారం జ‌గ‌న్‌ది.. జైలు ఎవ‌రికో?

Next Post

జ‌గ‌న్ భేటీకి చిరు స‌న్నాహం చూశారా?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist