నందమూరి నటసింహాం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అఖండ విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అఖండ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ.. అనౌన్స్ చేసినట్టుగా అక్టోబర్ 13న విడుదల కావడం లేదని.. మరోసారి ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో తప్పితే.. వేరే రాష్ట్రాల్లో ధియేటర్లు ఓపెన్ కాలేదని.. జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ లో లేరని.. అందుకనే ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకుంటున్నారట జక్కన్న.
అంతా అనుకున్నట్టుగా ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే.. ఆ డేట్ కి బాలయ్య అఖండ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారని సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అఖండ రిలీజ్ డేట్ డేట్ కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. మరి.. అఖండ రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా. ఇది నిజమేనా.?











