A Bollywood Hero Is Acting In Manchu Manoj’s Aham Brahmasmi Movie :
హీరో మంచు మనోజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అహం బ్రహ్మాస్మి. కొంత గ్యాప్ తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ లాక్ డౌన్ లో ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం కసరత్తులు చేశాడు. తన ఫిజిక్ ను పూర్తిగా మార్చడానికి కఠినమైన వర్కవుట్ లు చేసి, మనోజ్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడని సమాచారం.
కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. అహం బ్రహ్మాస్మి అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని ఎమ్ఎమ్ ఆర్ట్స్ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ గా ఉండే సినిమా కాదని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరు థ్రిల్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో కనిపిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి.
ఆ రోల్ లో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ శెట్టి రోల్ క్లైమాక్స్ లో వస్తోందట. ఒక నిముషం పాటు ఈ రోల్ ఉంటుందట కానీ.. ఈ క్యారెక్టర్ గుర్తుండేలా ఉంటుందని సమాచారం. ఖచ్చితంగా తనకు విజయాన్ని అందిస్తుందని మంచు మనోజ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి.. మనోజ్ నమ్మకాన్ని అహం బ్రహ్మాస్మి నిజం చేస్తుందని ఆశిద్దాం.
Must Read ;- సొంత ఖర్చుతో ‘మా’ భవనం కడతానంటున్న విష్ణు