అయితే కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకి అనువదించడంలో దర్శకురాలు నందినిరెడ్డి చాలా వరకు సఫలమయ్యారు. నటించే నటులు ఉంటే సినిమా కథను వాళ్లు అవలీలగా నడిపించేస్తారనే స్టేట్మెంట్ ని ఓ బేబి టీమ్ మళ్లీ రుజువు చేశారు. సినిమాలో కనిపించే ప్రతి నటి, నటుడు వాళ్ల పాత్రలకి సంపూర్ణమైన న్యాయం చేశారు. కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ మాదిరి అనిపించినా, ఎక్కువగా మెచ్యూర్డ్ యాక్షన్ తో ఆద్యంతం సినిమాను బాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇలా వారి నుంచి పర్ఫెక్ట్ యాక్షన్ ని రాబట్టుకోవడంలో నందినిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
చాలా చిన్న వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని, బిడ్డ కడుపులో ఉండగానే భర్త చనిపోతే, ఆ ఒంటరి తల్లి కష్టపడి పిల్లాడిని కని, పెంచి, పెద్దచేసి చివరకు జీవితాన్ని ఏ మాత్రం అనుభవించకుండా ముసలితనంలోకి వెళ్లిపోవడం, ఆ ఫ్రస్టేషన్ నుంచి బయట పడటానికి ఓల్డ్ ఏజ్ లో దేవుడుని తిట్టడం, దీంతో ఆ దేవుడే 70 ఏళ్ల ముసలవ్వను 23 ఏళ్ల అమ్మాయిలా మార్చేయడం, మళ్లీ లైఫ్ ని తిరిగి ఎంజాయ్ చేసేలా వరం ఇవ్వడం ఇదే కథగా ఓ బేబి సినిమా రూపొందింది. అయితే ఈ లాజిక్ లేని స్టోరీని చూసే ప్రేక్షకులకి ఏ మాత్రం అది డౌట్ రాని రీతిలో కామెడీ, నటినటులు యాక్షన్, మదర్ సెంటిమెంట్‌తో పూర్తిగా కవర్ చేశారు దర్శకురాలు నందిని రెడ్డి.
దీనికి తోడు మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం కూడా సినిమాని అమాంతం ఎలివేట్ చేసింది. రిచర్డ్ కెమెరా పనితనం, ఓ బేబిని ఓ విజువల్ ట్రీట్ గా మార్చేశాయి. ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా అనిపించింది. ఇక గుండె బరువెక్కే సీన్స్ వచ్చిన వెంటనే కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు మిక్చర్ తో ఓ బేబి ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ విందులా అనిపిస్తోంది. ఆల్రెడీ నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమంతకి ఓబేబితో మరో మెట్టు ఎక్కిందనే చెప్పి తీరాలి, 23 ఏళ్ల ముసాలావిడలా సమంత నటన, పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రతి స్ర్రీలో తల్లి ఉంటుంది. ఆ తల్లి ప్రేమకి వయసుతో సంబంధం లేదు అనే సున్నితమైన అంశాన్ని మనసుకి హత్తుకునేలా తెరకెక్కిన ఈ సినిమాకి సమంత తన నటనతో నూటికి నూరు శాతం న్యాయం చేసింది.
అలానే సమంత కొడుకుగా నటించిన రావురమేశ్ కూడా మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. ఇక సినిమాకి ఆయువుపట్టుగా మారిని సీనియర్ నటిమణి లక్ష్మీ ఈ సినిమాను ఆద్యంతం తన యాక్షన్ తో పరుగులు పెట్టించారు. తన సీన్ లో కనిపించిన ప్రతిసారీ ఆమె వైపే చూపరుల ఏకాగ్రత పడేలా తన నటనతో ఓ మ్యాజిక్ చేశారు. వెరసి మంచి నటీనటులు, టెక్నీషియన్లు కలిస్తే సినిమా విజయ ఢంకా మోగించడం ఖాయం అని మరోసారి రుజువు చేశారు ఓ బేబి చిత్ర యూనిట్. అయితే కొన్ని వర్గాల ప్రేక్షకులకి కి విపరీతంగా నచ్చే ఈ సినిమా ఇంకొందరికీ ఏ రీతిగా నచ్చుతుందో తెలియాలి.
తారాగణం: సమంత అక్కినేని, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, జగపతిబాబు, రావు రమేష్, అడివి శేష్, తేజ సజ్జా, సునయన, ఊర్వశి, ప్రగతి, ఐశ్వర్య తదితరులు
మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి. విశ్వప్రసాద్, హ్యున్వూ థామస్ కిమ్, దర్శకత్వం: నందిని రెడ్డి