మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే దానిపై ఆసక్తి, అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. 1960ల నుంచి కూడా మల్టీస్టారర్ ని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూ వస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఈ ట్రెండ్ మారినప్పటికీ.. ఇటీవల వస్తున్న మల్టీస్టారర్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రం వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గతంలో మల్టీస్టారర్ సినిమాల్లో ముగ్గురు హీరోలు కలిసి నటించిన సంధార్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఇద్దరు హీరోలకు మించి మల్టీస్టారర్ లో నటించడం చూడలేదు.అయితే ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందబోతోందట. అది కూడా మూడు వేరు వేరు ఇండస్ట్రిలకు చెందిన ముగ్గురు ప్రముఖ హీరోలతో.అవును.. ఒకే సినిమాలో ఇటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు నటించబోతున్నారట.
సాధారణంగా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ అవడం చాలా కష్టం.కానీ, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే వారు అలాంటి కాంబినేషన్‌ను సెట్ చేసి ప్రాజెక్ట్ చేయబోతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ‘కేజీఎఫ్’ ప్రాంచైజీతో హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయి.
ఇప్పటికే, ‘కేజీఎఫ్’ ప్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ , యంగ్ రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ప్రమోషన్ కొట్టేసిన టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో ‘సలార్’ రూపొందుతోంది. ఇక ఇదే క్రమంలో మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని లాక్ చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అందుకు గానూ అన్ని ఇండస్ట్రీలలోని టాప్ డైరెక్టర్స్, హీరోలతో ఒక కాంబోను కూడా ఫిక్స్ చేస్తున్నారట.
అలా సెట్ చేసిన కాంబోలో ఒక భాగమే టాలీవుడ్ యంగ్ హీరో నాని , కోలీవుడ్ స్టార్ సూర్య , మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లతో రూపొందబోయే మూవీ అట.ఈ భారీ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ సుధ కొంగర రూపొందించనున్నట్లు సమాచారం.
నిజానికి నిన్న మొన్నటి వరకు హోంబలే సంస్థలో సూర్య , దుల్కర్ సల్మాన్ హీరోలుగా సుధ కొంగర మల్టీస్టారర్ తెరకెక్కించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో మన టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని కూడా నటించబోతున్నాడట. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కించి పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేయనున్నారట. మరి దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.