తమిళ, తెలుగు భాషల్లో వైవిధ్యమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. ప్రత్యేకించి ‘సరైనోడు’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. పృధిని ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనేక వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుందని సమాచారం. దీనికోసం ఆది ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. ‘క్లాప్’ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఆగస్టులోనే రిలీజ్ అవ్వవలసిన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇటీవల చెన్నైలో షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ఆది, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నాడు దర్శకుడు ఆదిత్య.
శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీ బ్యానర్ లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ‘క్లాప్’ సినిమాకు అనేక ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయట. అయినా ఇప్పటివరకు ఓటీటీ సంస్థలకు నిర్మాతలు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది థియాటర్స్ లో రిలీజ్ చేయాలని మొదట నిర్మాతలు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ సార్ట్ అవుతోందని వస్తున్న వార్తల కారణంగా నిర్మాతలు మరో ఆలోచన చేయలేదని తెలుస్తోంది. ఈ సినిమాపై మాత్రం నిర్మాతలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో ఆదికి మంచి హిట్ దక్కుతుందని అంటున్నారు. మరి ‘క్లాప్’ సినిమాను నిర్మాతలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
Must Read ;- ఆ భారీ సెట్ ఎందులకు ‘ఆచార్య’ దేవా.. ?