జక్కన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏ ముహూర్తాన ప్రారంభమైందోగానీ జనం ముందుకు ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు. ఈ రోజు నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ మీద దృష్టి పెట్టి తారక్, రామ్ చరణ్ లతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ సంచలన చిత్రంలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి 10 శాతం మాత్రమే పెండింగ్ వర్క్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే.. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో సోమవారం నుంచే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్ ఫర్మ్ చేశారు.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మనందరి ఫేవరేట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నేడే స్టార్ట్ అయింది అని అలీమ్ హకీమ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. చరణ్ తో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు కానీ.. తారక్ ఎప్పుడు సెట్స్ లో ఎంట్రీ ఇస్తారో ఇంకా ప్రకటించలేదు.
జూలై 1 నుంచి హీరోయిన్ అలియా భట్ కూడా షూట్ లో జాయిన్ కానుందని సమాచారం. చరణ్ – అలియాభట్ లపై ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు ఫస్ట్ వీక్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలనేది జక్కన్న ప్లాన్. స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డట్ ఎప్పుడు అనేది ప్రకటించాలి అనుకుంటున్నారని సమాచారం.
Must Read ;- రాజమౌళి జేమ్స్ బాండ్ ను త్రివిక్రమ్ లాక్కున్నాడా?
Today In Hyderabad, Lockdown 2.0 is lifted and the movies have resumed their shoots.. Starting my day with a Haircut for Superstar Ram Charan @AlwaysRamCharan for the Movie #RRR directed by everyone’s favourite @ssrajamouli Sir.@alwaysramcharan @AalimHakim pic.twitter.com/vYODyMNEFH
— Aalim Hakim (@AalimHakim) June 21, 2021











