బాలీవుడ్ ఛోటా బచ్చన్ అభిషేక్, యాక్షన్ హీరో అజయ్ దేవ్ గణ్ నటించిన క్రైమ్ బయోపిక్ ది బిగ్ బుల్. నైంటీస్ లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణం మూల సూత్రధారి, స్టాక్ బ్రోకర్ అయిన హర్షత్ మెహతా జీవిత కథ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. కూకీ గులాటీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ను అజయ్ దేవ్ గణ్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ కుమార్, మంగళ్ పాథక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 8న డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ది బిగ్ బుల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
అజయ్ దేవ్ గణ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది టీజర్. అభిషేక్ బచ్చన్ ను పూర్తిగా రివీల్ చేయకుండా.. వెనుక నుంచి చూపిస్తూ.. విజువల్స్ చూపించారు. ది బిగ్ బుల్ ను పరిచయం చేస్తున్నాం.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటూ.. అజయ్ దేవ్ గణ్ ఈ టీజర్ ను ట్విట్టర్ లో విడుదల చేశాడు. ఈ నెల 19న ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. మరి దిగ్ బుల్ గా అభిషేక్ బచ్చన్ ఏ రేంజ్ లో పెర్ఫార్మెస్స్ ఇస్తాడో చూడాలి.
Must Read ;- మళ్ళీ బిగ్ బీ, మెగాస్టార్ కాంబో?
Introducing The Big Bull… The mother of all scams!!! Trailer out on 19th March. #TheBigBull releasing on 8th April only on @DisneyplusHSVIP, stay tuned! 📈#DisneyPlusHostarMultiplex
@juniorbachchan @Ileana_Official @nikifyinglife @s0humshah @kookievgulati @anandpandit63 pic.twitter.com/Uhta6N30dB— Ajay Devgn (@ajaydevgn) March 16, 2021