సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంగం డెయిరీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను ఇవాళ ఉదయం అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, ఆ వెంటనే గుంటూరు సమీపంలోని వడ్లమూడి సంగం డెయిరీకి చేరుకుని అక్కడ తనిఖీలు ప్రారంభించారు. సంగం డెయిరీలో తీవ్ర అవినీతి జరిగిందంటూ ఇప్పటికే దూళిపాళ్ల నరేంద్రను అదుపులోకి తీసుకుని బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి. తర్వాత గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.ఇక సంగం డెయిరీ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ అధికారులు వ్యాపార లావేదేవీలను తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా సంగం డెయిరీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.
అక్రమ అరెస్టును ఖండించిన…లోకేష్
టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఫ్యాక్షనిస్టు లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దూళిపాళ్ల కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దూళిపాళ్ల నరేంద్ర భార్యకు ఫోన్ చేసి లోకేష్ ధైర్యం చెప్పారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Must Read ;- సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు