వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.అక్రమాస్తుల కేసులో 16 నెలలు చిప్పుకూడు తిన్న సీఎం,ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆయన విమర్శించారు.పోలీసులు కూడా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని,అధికారం ఎవరికీ శాశ్వతంగా ఉండదని,తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరవాత అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేదే లేదని ఆయన హెచ్చరించారు.ఒక వేళ పదవీ విరమణ చేసినా,పొరుగు రాష్ట్రాలకు అధికారులు బదిలీపై వెళ్లినా వదిలేదే లేదని ఆయన హెచ్చరించారు.కర్నూలు జిల్లా టీడీపీ నేత బీసీ జనార్థర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
అరెస్టులు ఆపితే మంచిది..
ఇప్పటికైనా వైసీపీ నేతలు అక్రమ కేసులు మానితే మంచిదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు హితవు పలికారు.డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని,కేవలం వైసీపీ వారు ఇచ్చిన కేసులు మాత్రమే తీసుకుని,ప్రతిపక్షాల నేతలు ఇచ్చే కేసులను తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.చివరకు వైసీపీ ఎంపీ రఘురామరాజుపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చివరకు వైసీపీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారని, ఒక వేళ పార్టీ వీడితే జైల్లో పెడతారేమోనని వారు భయపడుతున్నారని ఆయన అన్నారు.ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు మాని,కరోనా కేసులు పెరగకుండా కట్టడి చేయాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
Must Read ;- ముఖ్యమంత్రులకు ప్రజల బాగోగులు పట్టవా..? : అచ్చెన్నాయుడు ఆగ్రహం