మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. లక్షణాలు లేకపోయినా రిజల్ట్ పాజిటివ్ రావడంతో.. వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయినప్పటికీ ఆచార్య సినిమాకి సంబంధించి.. చిరు లేని సీన్స్ ను .. నిన్నటి నుంచి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి షూటింగ్ లో తిరిగి పాల్గొనడానికి ఎంత లేదన్నా కనీసం నెల రోజులు టైమ్ పడుతుంది. అప్పటి వరకూ ‘ఆచార్య’ షూటింగ్ కు ఆయన అందుబాటులో ఉండడం అసాధ్యం. చిరు కండీషన్ ను బట్టి, ఆయన మూడ్ ను బట్టి.. డిసెంబర్ లో ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నాయి. లేకపోతే జనవరిలోనే.
నిజానికి వచ్చే సమ్మర్ లో ‘ఆచార్య’ సినిమాను రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ప్లాన్. ఆ విషయాన్ని ట్విట్టర్ లో కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే ఆ సీజన్ లో సినిమా రిలీజ్ అవడం కష్టమే. దానికి కారణమేంటంటే.. ఆచార్య సినిమాకి చిరంజీవి, చరణ్ సీన్సే కీలకమట. ఒక వేళ చిరంజీవి అందుబాటులోకి వచ్చినా.. ఆ టైమ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటే.. ఆచార్య షూటింగ్ కు ఆటంకమే అంటున్నారు. సో.. దీన్ని బట్టి చూస్తే వచ్చే సమ్మర్ కు ఆచార్య విడుదలవడం సాధ్యం కాని పని అన్నది సినీ వర్గాల వారి మాట. ఒకవేళ అప్పుడు మిస్ అయితే.. ఇక దసరాకి విడుదల చేయాలి. మరి చిరంజీవి ఎప్పుడు కోలుకుంటారో.. ఆచార్య షూటింగ్ ను తిరిగి ఎప్పుడు ట్రాక్ లోపెడతారో చూడాలి.











