తెలంగాణ సరిహద్దు ఆంక్షలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో వాహనాలు నిలివేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడుతూ సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేమిటని..? ప్రశ్నించారు. వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేస్తున్నారని, ముఖ్యమంత్రులకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే అయినా.. ఆంక్షలు ఎందుకని, సమస్యలపై ఇలాగే ప్రభుత్వాలు వ్యవహరిస్తే టీడీపీ ఉద్యమాలు చేస్తుందని అచ్చెనాయుడు హెచ్చరించారు.
తెలంగాణ పోలీసులు కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో ఏపీ నుంచి వచ్చే వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారు. అంబులెన్లకు అనుమతి ఇచ్చినప్పటికీ, వాహానాలకు నో చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున వాహానాలు నిలిచిపోయాయి. ఈ పాస్ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.