దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా? అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ గెలుస్తుందని తెలిసే, వైసీపీ దొంగ ఓట్లకు పాల్పడిందని అన్నారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? అంటూ డీజీపీపై మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలే దొంగ ఓట్లు వేయించడం దారుణమన్నారు. ఈ వ్యవహరంపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Must Read ;- వైసీపీ దొంగ ఓట్ల గుట్టురట్టు : ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో వైరల్











