కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 17శాతం ఉంటే ఏపీలో 21 శాతం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో కూడా కరోనా పాజిటివిటీ రేటు 9 శాతానికి తగ్గిందని ఆయన గుర్తు చేశారు.కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్రలో 50 వేల మంది కరోనా కేసులు ఉంటే,కేవలం 6 ఐసీయూ బెడ్లు, 44 వెంటిలేటర్ బెడ్లు మాత్రమే ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం ఎటు పోతోంది
ఏపీ ప్రభుత్వ కరోనా కేసులు వదిలేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడంపైనే దృష్టి సారించిందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా ఆసుపత్రుల్లో కనీసం బెడ్లు, మందులు,ఆక్సిజన్ కూడా అందించలేకపోతున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయకుండా,మాచేతుల్లో లేదని జగన్ చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 21 నుంచి 29దాకా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తే ఏపీ ప్రభుత్వం ఒక్క వ్యాక్సిన్ కూడా కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. రెడ్డి కులం వారం వ్యాక్సిన్ తయారు చేసే దాకా ఏపీ ప్రజలకు వ్యాక్సిన్ వేయరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.