విలక్షణ నటుడు ఆసిఫ్ బస్రా మరణంతో బాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. సుశాంత్ ఆత్మహత్య ను మరచిపోక ముందే ఇలాంటి మరో ఘటన జరగటంతో అందరూ దిగ్బ్రాంతిలో ఉన్నారు. ‘పాతాళ్ లోక్’ ఆసిఫ్ బస్రా మరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల మెక్‌లియోడ్‌గంజ్‌లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఉరివేసుకొని కనిపించడంతో ఇది ఆత్మహత్య అంటున్నారు. ఇది ఆత్మహత్య, హత్యా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బస్రా మరణం సోషల్ మీడియాలను కదిలించింది. విలక్షణ నటుడిగా ఆసిఫ్ బస్రా మీద ముద్ర ఉంది. బస్రా సొంతూరు మహారాష్ట్రలోని అమరావతి. కొంతకాలంగా ఆయన ధర్మశాలలో ఉంటున్నారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో బస్రా నటించారు. ఆయన నటించిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, జబ్ వి మెట్, కై పో చే, బ్లాక్ ఫ్రైడే, క్రిష్ 3, ఏక్ విలన్, ఫ్రీకీ అలీ, హిచ్కి లాంటి చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. హాలీవుడ్ చిత్రం పర్జానియాలోనూ ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది.
విమర్శకుల ప్రశంసలను సైతం నటుడిగా ఆయన సంపాదించుకున్నారు. పాతాళ్ లోక్ లాంటి వెబ్‌సీరిస్ తో ఆయన పేరు మరింత మార్మోగిపోయింది. మరో విశేషమేమిటంటే ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తోనూ ఆయన నటించారు. కై పో చే సినిమాలో సుశాంత్ తో నటించారు. అతని మరణంపై బాలీవుడ్ మొత్తం స్పందించింది. కరీనా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. 2007లో తాను జబ్ వి మెట్ చిత్రంలో బస్రాతో కలిసి నటించానన్నారు. బస్రా మరణం తనను కలచివేసిందని అనుష్కా శర్మ అన్నారు. బస్రా మరణంపై పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.
AlsoRead;-రేప్ చేస్తామంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు బెదిరింపులు