అక్కినేని సమంత హోస్ట్ గా చేస్తున్న టాక్ షో సామ్ జామ్. ఆహా కోసం చేస్తున్న ఈ టాక్ షోలో ఇప్పటి వరకు చిరంజీవి, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, తమన్నా, క్రిష్, నాగ్ అశ్విన్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు పాల్గొన్నారు. ఈ టాక్ షో లాస్ట్ ఎపిసోడ్ ను నాగచైతన్యతో ప్లాన్ చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నాగచైతన్య చెప్పిన సమధానాలు ఆసక్తి కలిగిస్తూ.. ఈ ఎపిసోడ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే.. ఈ ఎపిసోడ్ లో నాగచైతన్య సమంతను టీజ్ చేశారు. ఇంతకీ చైతన్య ఏమన్నారంటే.. ఇంట్లోనే పడుంటాడు, ఎప్పుడైనా వస్తాడు అని చివర్లో పిలిచావు కదా.. అని సరదాగా హర్టయ్యాడు. దీంతో తన నవ్వుతో భర్త అలకను పోగొట్టే ప్రయత్నం చేసింది సమంత. హోస్ట్‌గా నాకు ఎన్ని మార్కులేస్తావు? అని సమంత ఉత్సాహంగా అడిగింది. హోస్ట్‌గా అదరగొడుతున్నారు కాబట్టి చై తప్పకుండా ఆమెకు మంచి మార్కులే వేసుంటారు.
ఒకేసారి చాలామంది అమ్మాయిలను ఫ్లర్ట్ చేశావా..? అన్న ప్రశ్నకు చైతన్య సమాధానం చెప్పకుండా తప్పించుకోడానికి ట్రై చేసినట్లు ప్రొమోలో కనిపించింది. నా వంటకు ఎన్ని మార్కులు ఇస్తావు.? అని సామ్ అడిగిన ప్రశ్నకు అసలేం అడుగుతున్నావు అని నిలదీశారు చైతన్య. ఇక ఇంటిని మ్యానేజ్ చేయడంలో నాకెన్ని పాయింట్లిస్తావు? అన్న దానికి కూడా అది నీకేం వచ్చన్నట్లుగా ఎదురు ప్రశ్నించారు.
పనిలో పనిగా ఇంట్లో తను ఏదైనా సలహా ఇస్తే తీసుకోదన్న విషయాన్ని కూడా బయటపెట్టేశారు చైతన్య. అంతే కాకుండా.. నేను కాలేజీకి వెళ్లి బ్యాక్ బెంచ్‌లో కూర్చున్నా, నువ్వు కాలేజీకి అయినా వెళ్లావా? అని అడగడంతో షాక్ అయినట్టుగా సామ్ నోరు తెరిచారు. ఈ సారి నువ్వు నీ గెస్ట్‌ను తికమతక పెట్టలేవు, ఎందుకంటే… నాకు నీ గురించి అన్నీ తెలుసు అని చైతన్య చెప్పేయడంతో సామ్ దొరికిపోయానన్నట్లుగా ముసిముసిగా నవ్వింది. ఈ ప్రోమో చైతన్య – సమంత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ టాక్ షో ఎపిసోడ్ ఈ నెల 8న ఆహాలో ప్రసారం కానుంది.
Must Read ;- ‘సామ్ జామ్’ 8 ఎపిసోడ్ లకే పరిమితమా.?











