నేచురల్ స్టార్ నాని ఇటీవల అంటే.. సుందరానికి అనే సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వెరైటీ టైటిల్ తో రానున్న ఈ సినిమా అడల్ట్ కామెడీ నేపథ్యంతో ఉంటుందని తెలిసింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ సినిమా పై ఇంట్రస్ట్ ని మరింత పెంచిందని చెప్పచ్చు. అయితే.. ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కకుంది.
ఇంతకీ విషయం ఏంటంటే… ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ.. మెంటల్ మదిలో చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత బ్రోచేవారెవరురా సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో మైత్రీ బ్యానర్ లో నానితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అయితే.. వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా చిత్రం తర్వాత తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరికి సినిమా చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నారట.
ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ను పక్కనపెట్టి వివేక్ ఆత్రేయ మైత్రీ బ్యానర్ లో సినిమా చేస్తుండడంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నిర్మాత రాజ్ కందుకూరి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వివేక్ ఆత్రేయ మూడవ చిత్రాన్ని ఖచ్చితంగా తన బ్యానర్ లోనే చేయాలని రాజ్ కందుకూరి పట్టుబడుతున్నారట. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని రాజ్ కందుకూరి డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తుందో చూడాలి.
Must Read ;- విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?