యువ హీరో నితిన్ – మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మార్చి నెలాఖరున కానీ.. ఏప్రిల్ లో కానీ రంగ్ దే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ‘రంగ్ దే’ కంటే ముందుగా నితిన్ చెక్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ‘ఐతే, ఒక్కడున్నాడు, అనుకోకుండా ఒకరోజు, సాహసం.. ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో చెక్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘చెక్’ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని ఫిబ్రవరి 19న రిలీజ్ చేయబోతున్నారు. రంగ్ దే రిలీజ్ చేసి ఆతర్వాత చెక్ రిలీజ్ చేస్తారనుకుంటే.. ఇప్పుడు ప్లాన్ మార్చి ముందుగా చెక్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు.
Must Read ;- నితిన్ ‘రంగ్’ దే విడుదలకు ముహూర్తం ఖరారు..!
The wait is over! #Check♟️ is coming to you on February 19th. 😎
#CheckOnFeb19th@yeletics @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @BhavyaCreations @adityamusic pic.twitter.com/uIq4IsGoiZ— nithiin (@actor_nithiin) January 22, 2021