మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిపై స్పష్టత వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వ్యక్తులందరి పేర్లూ బయటికి వచ్చాయి. మంచు విష్ణు ప్యానల్ కు సంబంధించి ఇప్పటిదాకా లిస్టు విడుదల కాలేదు. కాకపోతే ఆయన ప్యానల్ లో ప్రధాన కార్యదర్శిగా పోటీ పడబోతున్న వ్యక్తి పేరు ఈరోజు బయటికి వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్నారు.
ఇక విష్ణు ప్యానల్ నుంచి నటుడు గిరిబాబు తనయుడు రఘుబాబు పోటీపడబోతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి కూడా త్రిముఖ పోటీ జరగబోతోంది. జీవిత, రఘుబాబు కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పోటీపడుతున్నారు. అక్బోబరు 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Must Read ;- ‘మా’ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉపాధ్యక్ష పదవికి హేమ