యాంగ్రీ మేన్ రాజశేఖర్ .. చిన్న కూతురు శివాత్మిక ఆల్రెడీ .. ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె అక్క శివానీ మాత్రం ఇంకా డెబ్యూ బోణీ కొట్టలేదు. అయితే బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘2 స్టేట్స్’ తెలుగు వెర్షన్ లో శివానీ కథానాయికగా ఎంపికైనప్పటికీ.. ఆ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదు. అందులో అడివి శేష్ హీరో అని కూడా అనౌన్స్ మెంట్ జరిగింది.
ఇప్పుడు ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. శివానీ ఇప్పుడు మరో బాలీవుడ్ రీమేక్ లో కథానాయికగా ఎంపికైందనే వార్తలొస్తున్నాయి. సినిమా పేరు ఆర్టికల్ 15. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కేస్టిజమ్ మీద పోరాడే ఒక యువ పోలీస్ అధికారి కథ ఇది. ఈ సినిమాను ఇప్పుడు బోనీకపూర్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాకి దర్శకుడు.
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలెన్ ఇందులో హీరో గా నటిస్తూండడం విశేషాన్ని సంతరించుకుంది. సయానీ గుప్తా పాత్రను శివానీ చేయబోతోంది. అంటే.. ఆమె ఇందులో గిరిజన యువతిగా కనిపిస్తుందన్నమాట. తమిళనాడులోని పొల్లాచ్చి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మరి ఈ సినిమా శివానీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- రాజశేఖర్, గోపీచంద్ మల్టీస్టారర్.. నిజమేనా?