మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ ఆచార్య. ఈ మూవీ టీజర్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండడం.. ఆఖరికి చిరు సైతం టీజర్ పై సోషల్ మీడియాలో మీమ్ రూపంలో పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది. ఈ రోజు ఉదయం కొరటాల ఆచార్య టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది అని టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
అంతే కాకుండా.. ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేస్తూ.. తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని తెలియచేశారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఈ టీజర్ లో చరణ్ కనిపించడని.. కేవలం చిరంజీవి పాత్రపై హైలెట్ చేస్తూ ఈ టీజర్ కట్ చేశారట. అయితే.. చరణ్ గొంతు మాత్రం వినిపిస్తుందని, ఈ టీజర్‌కి చరణ్ వాయిస్ ఓవర్ అందించాడని టాక్ వినిపిస్తుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ ఆచార్య టీజర్ గురించి ట్విట్టర్ లో స్పందిస్తూ… చరణ్ అన్న వాయిస్ ఓవర్ అట టీజర్ కి.. అచ్చా బయట టాకు అని ఉన్న మీమ్ ను చిరంజీవి, చరణ్ కి ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం విశేషం.
Must Read ;- అందాల కాజల్ కోసమే ఆచార్య వెయింటింగ్