తెలుగు యువ కథానాయకులలో ఎనర్జిటిక్ హీరోగా రామ్ కి మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడు చూసినా యాక్టివ్ గా ఉండే రామ్, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంపిక చేసుకుంటూ వెళుతుంటాడు. కథను నాన్చడం .. నత్తనడక నడిపించడం ఆయనకు ఇష్టం ఉండదు. సినిమా ఉండేదే రెండు గంటలు .. ఈలోగా అనవసరమైన నస ఉండకూడదనేది ఆయన పాలసీ. అందువల్లనే కథాకథనాలను తనతో పాటు పరుగులు తీయిస్తూ ఉంటాడు. ఈ కారణంగానే ఆయన సినిమాలో చకచకా సీన్స్ మారిపోతూ .. కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది.
అలాంటి రామ్ హీరోగా .. ఆయన తాజా చిత్రంగా ‘రెడ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫరవాలేదనిపించుకుంది. దాంతో రామ్ తన తరువాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని రామ్ చాలాకాలంగా ఆశపడుతున్నాడు. అయితే రామ్ కంటే ముందుగానే అక్కడ లైన్లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. అందువలన తన ఆశ ఇప్పట్లో నిజమయ్యే అవకాశాలు కనిపించలేదు. దాంతో రామ్ ఎవరితో .. ఏ జోనర్లో చేస్తే బాగుంటుందనే ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయనకి అనిల్ రావిపూడి పేరు గుర్తుకు వచ్చిందట. ఆయనకి కాల్ చేస్తే, రామ్ కి సరిపోయే కథ ఒకటి తన దగ్గర ఉందని అనిల్ రావిపూడి చెప్పాడట. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత చేద్దామని చెప్పాడని అంటున్నారు. అసలు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాను రామ్ చేయవలసింది. అంధుడిగా తనని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆయన భయపడటంతో ఆ కథ రవితేజకు వెళ్లిపోయింది. అలా ఒక భారీ హిట్ చేజారిపోయింది. అందువలన ఈ సారి తప్పకుండా ఆయన డైరెక్షన్లో చేయాలని రామ్ భావిస్తున్నాడు. అయితే అందుకు ఆలస్యం ఉండటంతో, వెంకీ కుడుములనుగానీ, వెంకీ అట్లూరినిగాని లైన్లో పెట్టే ఆలోచనలో రామ్ ఉన్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Must Read ;- రవితేజ లేకపోతే నేను లేను క్రాక్ డైరెక్టర్